లాక్ డౌన్ టైమ్ లో పాయల్ ఏం చేస్తోంది?

Wednesday,April 01,2020 - 02:54 by Z_CLU

హీరోయిన్లంతా ఈ లాక్ డౌన్ ను చక్కగా ఉపయోగించుకుంటున్నారు. పూజా హెగ్డే ఇంట్లోనే రకరకాల ఎక్సర్ సైజులు చేస్తోంది. శృతిహాసన్ అయితే రోజుకో వంటకం స్వయంగా వండుకొని లాగించేస్తోంది. తమన్న అయితే తన గ్లామర్ పెంచుకునే పనిలో పడింది. మరి హాట్ బ్యూటీ పాయల్ ఏం చేస్తోంది?

పాయల్‌ రాజ్‌పుత్‌ తెలుగు లాంగ్వేజ్ నేర్చుకుంటోంది. లాక్‌డౌన్‌ కొనసాగనున్న 21 రోజుల పాటు రోజూ 21 వాక్యాలు చొప్పున తెలుగు నేర్చుకుంటున్నానని అంటోంది ఈ చిన్నది. ఇంటర్నెట్ లో సెర్చ్ చేసి మరీ తెలుగు పదాల్ని హిందీలో రాసుకొని ప్రాక్టీస్ చేస్తున్నానని తెలిపింది.

చాలామంది హీరోయిన్లు తెలుగులో చక్కగా మాట్లాడతారు. పూజా హెగ్డే, రాశిఖన్నా లాంటి హీరోయిన్లు తమ పాత్రలకు తామే డబ్బింగ్ కూడా చెప్పుకుంటున్నారు. అందుకే పాయల్ కూడా తెలుగు నేర్చుకోవాలని డిసైడ్ అయింది.