కాజోల్ కు కరోనా.. నిజమేనా?

Wednesday,April 01,2020 - 04:15 by Z_CLU

ప్రస్తుతం కరోనా కంటే వేగంగా దానికి సంబంధించిన పుకార్లు దేశమంతా వ్యాపిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఓ పుకారు నటుడు అజయ్ దేవగన్ ను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఒకప్పటి హీరోయిన్, అజయ్ దేవగన్ భార్య కాజోల్ కు కరోనా సోకిందనేది ఆ రూమర్.

ఈ గాసిప్ ఇలా వచ్చిందో లేదో అంతా అజయ్ దేవగన్ ను ట్యాగ్ చేయడం స్టార్ట్ చేశారు. దాదాపు 24 గంటల పాటు ఈ టార్చర్ అనుభవించిన అజయ్ ఎట్టకేలకు దీనిపై క్లారిటీ ఇచ్చాడు. తన భార్యకు, కూతురుకు కరోనా సోకలేదని స్పష్టంచేశాడు.

అందరూ అనుకుంటున్నట్టు కాజోల్ కు ఏమీ కాలేదంటున్నాడు అజయ్ దేవగన్. కూతురు నైషా కూడా పూర్తి ఆరోగ్యంగా ఉందని, సింగపూర్ నుంచి వచ్చిన తర్వాత తను సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్లిందని స్పష్టంచేశాడు.

ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు అజయ్ దేవగన్. చరణ్-తారక్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాలో అజయ్ దేవగన్ పాత్ర చాలా ప్రత్యేకంగా, ఇంకెంతో షాకింగ్ గా కూడా ఉంటుందంటున్నాడు దర్శకుడు రాజమౌళి.