కరోనా టైమ్ లో కథ రాస్తున్న పూరీ

Wednesday,April 01,2020 - 02:33 by Z_CLU

దేశమంతా లాక్ డౌన్ లో ఉంటే దర్శకుడు పూరి జగన్నాధ్ మాత్రం మరో కొత్త కథ రాయడంలో బిజీగా ఉన్నాడు. ఈ గ్యాప్ తనకు ఓ మంచి అవకాశం అంటున్నాడు. తన క్వారంటైన్ అనుభవాలతో పాటు.. తనపై చిరంజీవి సెటైరిక్ గా వేసిన ట్వీట్ పై కూడా పూరి రియాక్ట్ అయ్యాడు.

“లాక్ డౌన్ టైమ్ లో ఇబ్బందేం లేదు. నాకు ఇదో మంచి అవకాశం. ఓ కొత్త కథ రాయడం మొదలుపెట్టాను. టైమ్ కు తింటున్నా, టీవీ చూస్తున్నా, నిద్రపోతున్నా. ఇలానే బతకాలన్నప్పుడు దాన్ని ఎంజాయ్ చేయడమే. జైలులో బతకాల్సి వచ్చినప్పుడు దాన్ని ఎంజాయ్ చేస్తూ బతికేయడమే. ఇదే నా ఫిలాసఫీ కూడా.”

“చిరంజీవి సర్ ట్వీట్ నా కొంప ముంచింది. ఆయనెందుకు బ్యాంకాక్ టాపిక్ ఎత్తారో నాకు తెలియదు. ఆయన ట్వీట్ చూస్తున్నప్పుడు పక్కనే మా ఆవిడ ఉంది. ఆవిడకు ఒక్కసారిగా అన్నీ గుర్తొచ్చాయి. అంతే, నాకు ఓ దెబ్బ పడింది. ఆయన ట్వీట్ వల్ల నా చెంప పగిలిపోయింది.”