డిసెంబర్ ఎండింగ్ కు కాటమరాయుడు పూర్తి

Monday,November 21,2016 - 10:02 by Z_CLU

పవన్ తన కెరీర్ లో ఎప్పుడూ ఇంత స్పీడ్ గా వర్క్ చేయలేదు. ఒకేసారి 3 సినిమాలు ప్రారంభించడం, మరోవైపు పొలిటికల్ గా కూడా బిజీ అవ్వడంతో… కమిట్ మెంట్స్ ను వీలైనంత తొందరగా పూర్తిచేయాలనుకుంటున్నాడు పవర్ స్టార్. ఇందులో భాగంగా నిన్నగాకమొన్న ప్రారంభించిన కాటమరాయుడు షూటింగ్ ను అప్పుడే క్లయిమాక్స్ కు తీసుకొచ్చాడు. తాజా సమాచారం ప్రకారం… మరో నెలరోజుల్లో.. అంటే డిసెంబర్ మూడో వారానికి కాటమరాయుడు షూటింగ్ కంప్లీట్ అయిపోతుందట. ప్రస్తుతం హైద్రాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరిస్తున్నారు. హీరో పవన్, హీరోయిన్ శృతిహాసన్ మధ్య ఈ షెడ్యూల్ కొనసాగుతోంది.

డాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కాటమరాయుడు సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే పాటల కంపోజింగ్ పూర్తిచేశాడు అనూప్. జనవరి ఎండింగ్ లేదా ఫిబ్రవరిలో కాటమరాయుడు ఆడియో రిలీజ్ ఫంక్షన్ ఉంటుంది. శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ సినిమాను మార్చిలో థియేటర్లలోకి తీసుకొస్తున్నారు.