డెడ్ లైన్ ఫిక్స్ చేసిన బన్నీ

Monday,November 21,2016 - 12:22 by Z_CLU

కాస్త లేట్ గా సెట్స్ పైకి వచ్చినప్పటికీ… జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నాడు స్టయిలిష్ స్టార్. హరీష్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న డీజే సినిమాకు డెడ్ లైన్ కూడా ఫిక్స్ చేశాడు. తన నెక్ట్స్ సినిమా దర్శకుడు లింగుస్వామితో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం… మార్చి ఎండింగ్ కు ఆ సినిమా స్టార్ట్ చేయాలి. సో… ఈలోగానే డీజే సినిమాను కంప్లీట్ చేయాలి. ప్రస్తుతం అదే పనిలో ఉన్న బన్నీ…. హైదరాబాద్ లో జరుగుతున్న ఓ భారీ షెడ్యూల్ లో యాక్షన్ ఎపిసోడ్ లో నటిస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల చేయాలనుకుంటున్నారు. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. డీజే అంటే దువ్వాడ జగన్నాధమ్.