పవన్ హీరోయిన్ రేసులో పూజా హెగ్డే ..?

Monday,November 21,2016 - 09:30 by Z_CLU

బాలీవుడ్ లో ఫ్లాప్ హీరోయిన్ గా పేరుతెచ్చుకున్న పూజా హెగ్డే, తెలుగులో మాత్రం భారీ అవకాశాలు అందిపుచ్చుకుంటోంది. ముకుంద సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ ఫెయిర్ అండ్ లవ్లీ బ్యూటీ… ఇప్పుడు పవన్ సినిమాలో నటించే అవకాశానికి అడుగు దూరంలో ఉంది. త్వరలోనే పవన్ కలిసి చేయబోతున్న సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డేను తీసుకునే ఆలోచనలో ఉన్నాడట దర్శకుడు త్రివిక్రమ్. ఈ మేరకు ఆమెకు చర్చలు కూడా జరిపాడట.
keerthy-suresh-pooja-hegde
ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తిసురేష్ ను ఫిక్స్ చేశారు. ఆ విషయాన్నీ కీర్తి సురేష్ స్వయంగా ప్రకటించింది. పవన్ సరసన నటించే ఛాన్స్ రావడం తన జన్మజన్మల అదృష్టం అంటూ పొంగిపోయింది. ఇప్పుడు సడెన్ గా పూజా హెగ్డే పేరు తెరపైకి రావడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అయితే పవన్ సినిమాలో ఇద్దరు భామలుంటారనే విషయాన్ని త్రివిక్రమ్ ఇప్పటికే కన్ ఫం చేశాడు. మరి పూజా హెగ్డే కనుక ఓకే అయితే… మూవీలో ఫస్ట్ హీరోయిన్ ఎవరనేది సస్పెన్స్ గా మారనుంది.