#BheemlaNayakTitleSong బర్త్ డే ట్రీట్ అదిరింది

Thursday,September 02,2021 - 01:01 by Z_CLU

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సినిమా ‘భీమ్లా నాయక్’ నుండి ఫస్ట్ సింగిల్ రిలీజయింది. తమన్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ ను పవన్ బర్త్ డే సందర్భంగా విడుదల చేశారు మేకర్స్. భీమ్లా నాయక్ అంటూ వచ్చే ఈ టైటిల్ సాంగ్ ప్రెజెంట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ పవన్ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటుంది.

ఈ సాంగ్ ను స్పెషల్ గా డిజైనింగ్ చేసి షూట్ కూడా చేశారు.  ముందుగా ఒగ్గు కథ చెప్తున్నట్లుగా సాంగ్ ని స్టార్ట్ చేసి ఆ తర్వాత తమన్ అండ్ టీం పాడుతూ మ్యూజిక్ చేస్తున్నట్లుగా షూట్ చేసి ఆ విజువల్స్ తో ఎట్రాక్ట్ చేశారు. మధ్య మధ్యలో పవన్ స్టిల్స్ , క్లిప్స్ వేస్తూ  సాంగ్ కి విజువల్ గా మరింత పవర్ తీసుకొచ్చారు. ఇక తమన్ కంపోజీషన్ లో శివమణి డ్రమ్స్ కూడా సింగిల్ వీడియోలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.

రామజోగయ్య శాస్త్రి పవర్ ఫుల్ లిరిక్స్ సాంగ్ కి మరింత బలం చేకూర్చి హైలైట్ గా నిలిచాయి. ముఖ్యంగా సినిమాలో పవన్ పాత్ర ఎలా ఉంటుందో చెప్పే విధంగా మంచి సాహిత్యం అందించారు రాంజో. ఫైనల్ భీమ్లా నాయక్ నుండి పవన్ బర్త్ డే సందర్భంగా రిలీజయిన టైటిల్ సాంగ్ ద్వారా ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ అందింది. సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్ పై నాగ వంశీ నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ సరసన నిత్యా మీనన్ , రానా సరసన ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ స్టేజిలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్స్ లోకి రాబోతుంది. ఇక నుండి వరుసగా ఈ సినిమా నుండి అప్ డేట్స్ వచ్చేలా టీం ప్లాన్ చేస్తున్నారు.