#Pushpa తగ్గేదేలే అంటున్న బన్నీ !

Thursday,September 02,2021 - 01:42 by Z_CLU

అల్లు అర్జున్ -సుకుమార్ కాంబోలో సినిమా అంటే ఈసారి కూడా ఇద్దరు కొత్తగానే ట్రై చేస్తారని అందరూ అనుకున్నారు. సుక్కు -బన్నీ కూడా టీజర్ తోనే తమ నుండి ఎలాంటి సినిమా రాబోతుందో క్లియర్ కట్ గా చెప్పేశారు. టీజర్ లో యాక్షన్ ఎపిసోడ్స్ తో మాస్ ఆడియన్స్ కోసం మంచి ఊరమాస్ సినిమా వస్తుందని హింట్ ఇచ్చారు. అలాగే సినిమాలో బన్నీ మేనరిజంతో చెప్పే ఓ డైలాగ్ ను కూడా టీజర్ లో వదిలేసి ఆ డైలాగ్ తో సినిమాపై హైప్ తీసుకొచ్చారు. ప్రస్తుతం బన్నీ ఫ్యాన్స్ మాత్రమే కాదు ఈ సినిమా గురించి ఏ టాపిక్ వచ్చినా అందరికీ ‘తగ్గేదే లే’ అంటూ ఈ డైలాగే గుర్తొస్తుంది. అంతలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది బన్నీ డైలాగ్.

టీజర్ తోనే ఈ రేంజ్ లో ఇంపాక్ట్ క్రియేట్ చేసి సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేసిన బన్నీ నెక్స్ట్ ట్రైలర్ కూడా “తగ్గదే లే” అన్నట్ట్టుగానే ప్లాన్ చేస్తున్నాడట. అవును ఇప్పటికే సుక్కు అండ్ టీం షూట్ చేసిన రషెస్ నుండి ట్రైలర్ కట్స్ కొన్ని తీసి పక్కన పెట్టారట. దాన్ని ఎడిటర్ చేతిలో పెట్టి అదిరిపోయే ట్రైలర్ కట్ చేయడమే ఆలస్యమని తెలుస్తుంది. వచ్చే నెల దసరా లేదా నవంబర్ లో దీపావళి రోజు ట్రైలర్ ని రిలీజ్ చేసే ప్లానింగ్ లో ఉన్నారని సమాచారం.

ప్రస్తుతం ‘పుష్ప’ టీం మారేడుమిల్లి బయలుదేరింది. రేపటి నుండి అక్కడ అల్లు అర్జున్ -ఫహాద్ ఫాజిల్ పై  కొన్ని కీలక సన్నివేశాలు తీయబోతున్నారు. అలాగే బన్నీ -రష్మిక మధ్య ఓ సాంగ్ కూడా తెరకెక్కించనున్నారని తెలుస్తుంది. వచ్చే నెల మళ్ళీ హైదరాబాద్ తిరిగి వచ్చి ఇక్కడ ఐటెం సాంగ్ తీయనున్నారు. దాంతో టోటల్ షూట్ కి గుమ్మడి కాయ కొట్టేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పై దృష్టి పెట్టనున్నాడు సుకుమార్. డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా Pushpa (The Rise) ను విడుదల చేయనున్నారు. వచ్చే ఏడాది పార్ట్ ను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు.