Vakeel Saab రిలీజ్ ఎప్పుడంటే ?

Wednesday,January 27,2021 - 05:13 by Z_CLU

పవన్ కళ్యాణ్ ‘Vakeel Saab’ షూటింగ్ పూర్తి చేసి PSPK27 సినిమా మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘వకీల్ సాబ్’ కి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. అయితే ఇంత వరకు సినిమా రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించలేదు మేకర్స్. దీంతో సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్స్ లోకి వస్తుందా ? అంటూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు పవన్ ఫ్యాన్స్.

ప్రస్తుతం అందుతున్న సమాచారమ్ ప్రకారం ఈ సినిమాను ఏప్రిల్ 9న ఉగాది స్పెషల్ గా విడుదల చేయనున్నారట. ఇప్పటికే రిలీజ్ కి సంబంధించి ప్రమోషనల్ వర్క్ శరవేగంగా జరుగుతుందని తెలుస్తుంది. త్వరలోనే రిలీజ్ డేట్ ను ప్రకటించి అక్కడి నుండి ప్రమోషన్స్ పై మరింత దృష్టి పెట్టబోతున్నారట మేకర్స్. మార్చ్ లో ట్రైలర్ రిలీజ్ చేసి ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో రెండు చోట్ల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ప్లాన్ చేయబోతున్నారని టాక్.

బోణీ కపూర్ సమర్పణలో రాజు , శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమాకు వేణు శ్రీ రామ్ దర్శకుడు. తమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.