అప్పుడు తొలిప్రేమ.. ఇప్పుడు రంగస్థలం

Tuesday,April 10,2018 - 01:09 by Z_CLU

పవర్ స్టార్ కెరీర్ లో మరపురాని చిత్రం తొలిప్రేమ. ఇక మెగాపవర్ స్టార్ కెరీర్ లో ఓ మైల్ స్టోన్ రంగస్థలం. ఈ రెండు సినిమాల మధ్య ఓ గమ్మత్తయిన పోలిక ఉంది. అది కూడా పవన్ కల్యాణ్ చెప్పిన తర్వాత బయటపడింది. అవును.. తన జీవితంలో తొలిప్రేమ, రంగస్థలం మధ్య కంపోరిజన్ తీసుకొచ్చాడు పవన్.

“నేను చాలా తక్కువసార్లు బయటకు వస్తాను. తొలిప్రేమ తర్వాత ఎప్పుడు నేను థియేటర్లకు రాలేదు. కానీ ఎందుకో రంగస్థలం సినిమాను థియేటర్లలోనే చూడాలనిపించింది. చాలా అద్భుతమైన సినిమా ఇది. రామ్ చరణ్ అద్భుతంగా నటించాడు.” ఇలా రంగస్థలం, తొలిప్రేమ మధ్య కనెక్షన్ ను బయపెట్టాడు పవన్.

రంగస్థలం సినిమా సక్సెస్ మీట్ ను ఈనెల 12న నిర్వహించే అవకాశం ఉంది. ఆ సక్సెస్ మీట్ కు కచ్చితంగా వస్తానని మీడియా ద్వారా వెల్లడించాడు పవన్. చాలా రోజుల తర్వాత ఒకే వేదికపై చిరంజీవి, రామ్ చరణ్, పవన్ కల్యాణ్ కనిపించబోతున్నారన్నమాట.