మహేష్ బాబు సరసన అర్జున్ రెడ్డి భామ

Tuesday,April 10,2018 - 12:36 by Z_CLU

ప్రస్తుతం భరత్ అనే నేను సినిమా పనులతో బిజీగా ఉన్నాడు మహేష్ బాబు. ఈ మూవీ థియేటర్లలోకి వచ్చిన వెంటనే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో కొత్త సినిమాను సెట్స్ పైకి తీసుకొస్తాడు. ఈ మూవీ లాంఛింగ్ ఎప్పుడో జరిగింది. మహేష్ కాల్షీట్ల కోసం వెయిటింగ్. పైగా ఇది మహేష్ కు ప్రతిష్టాత్మక 25వ చిత్రం కావడం విశేషం. ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో మరో హీరోయిన్ గా షాలినీ పాండేను తీసుకున్నారట.

మహేష్ మూవీలో హీరోయిన్ గా ఇప్పటికే పూజా హెగ్డేను తీసుకున్నారు. ఈ విషయాన్ని పూజా హెగ్డే స్వయంగా ప్రకటించింది. ఇప్పుడు సెకెండ్ హీరోయిన్ క్యారెక్టర్ కోసం షాలిని పాండేను తీసుకున్నారట. సినిమాలో షాలినీ పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉందని తెలుస్తోంది. ఇదే సినిమాలో అల్లరినరేష్ కూడా ఓ కీలక పాత్ర పోషించనున్నాడు.

దిల్ రాజు, అశ్వనీదత్ కలిసి ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ఊపిరి మూవీ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న వంశీ పైడిపల్లి, ఎంతో కష్టపడి ఈ స్క్రిప్ట్ రెడీ చేశాడు. భరత్ అనే నేను థియేటర్లలోకి వచ్చిన వెంటనే తాజా చిత్రంపై ఓ క్లారిటీ వస్తుంది.