నాని ఇంటర్వ్యూ

Tuesday,April 10,2018 - 04:05 by Z_CLU

నాని ‘కృష్ణార్జున యుద్ధం’ టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ వైబ్స్ క్రియేట్ చేస్తుంది. 2 డిఫెరెంట్ క్యారెక్టర్స్ లో మెస్మరైజ్ చేయనున్న నాని, ఈ సినిమా సమ్మర్ సీజన్ కి పర్ఫెక్ట్ రిలీజ్ అని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఈ సందర్భంగా ఈ సినిమా గురించి మరెన్నో విషయాలు షేర్ చేసుకున్నాడు. ఆ చిట్ చాట్ మీకోసం….

అ! వల్లే ఈ ఫీలింగ్…

మామూలుగా నా ప్రతి సినిమాకి అట్లీస్ట్ 3, 4 నెలల గ్యాప్ ఉన్నట్టు అనిపించేది. కానీ అ! వల్ల ఈ సారి ఆ మాత్రం గ్యాప్ ఉన్న ఫీలింగ్ కూడా లేదు. అ! చేసేటప్పుడు జస్ట్ వెనక నేను ఉండే సరిపోతుందనుకున్నా కానీ, నా సినిమాలాగే ప్రమోషన్స్, బిఫోర్ రిలీజ్ వైబ్స్… అంతలో ఇప్పుడు కృష్ణార్జున యుద్ధం. ఈసారి గ్యాప్ వచ్చిన ఫీలింగ్ లేదు.

 

అ! టార్గెట్ రీచ్ అయింది…

అ! ప్రొడ్యూసర్ గా నేను చాలా హ్యాప్పీ. ఆ సినిమా అందరికోసం చేసింది కాదు. ఆ టార్గెట్ ఆడియెన్స్ వేరు. ఆ క్లారిటీ చేసేటప్పుడు మాకుంది కాబట్టే ప్రమోషన్స్ లో క్లియర్ గా చెప్పాం. అందుకే అనుకున్నదానికన్నా పెద్ద సక్సెస్ అయింది. ఆ సినిమా చేసినందుకు గర్వంగా ఫీలవుతున్నా…

డ్యూయల్ రోల్స్ లో  3 వ సినిమా…

డ్యూయల్ రోల్ స్టోరీస్ తో డైరెక్టర్ నా దగ్గరికి ఎందుకు వస్తున్నారో నాకు తెలీదు కానీ నేను చేసిన డ్యూయల్ రోల్ సినిమాలన్నీ చేసినవే. ‘జెండాపై కపిరాజు’ కూడా అద్భుతమైన సినిమా. సినిమా ఆడకపోవడానికి కారణాలేవైనా ఉండొచ్చు కానీ, స్క్రిప్ట్ పరంగా చాలా డెప్త్ ఉన్న సినిమా.

కృష్ణార్జున యుద్ధం వేరు…

సినిమా ‘హలో బ్రదర్’ లా ఉండదు. అసలా సెటప్ వేరు ఈ సినిమా వేరు. ఇక్కడా కృష్ణ, అర్జున్ కి అసలు బ్యాక్ స్టోరీలాంటివి ఏమీ ఉండవు. వాళ్ళెందుకు కలుసుకున్నారు..? ఎలా కలుసుకున్నారు..? అసలా యుద్ధం ఎందుకు అనేది డిఫెరెంట్ జోనర్…

అంత దమ్మున్నప్పుడే చేయాలి…

సినిమాలో ఒక పర్టికులర్ యాస ట్రై చేయడం నిజంగా రిస్కే. అంత దమ్మున్నప్పుడే చేయాలి. లేకపోతే మన భాషని మనం ఖూనీ చేసుకున్నట్టే అవుతుంది. కాబట్టి మామూలుగా నేను అలాంటివి ప్రిఫర్ చేయను. కానీ గాంధీ పక్కా చిత్తూరు కుర్రాడు. తను  కృష్ణ  గురించి   చెప్పేటప్పుడే తన మాటలు ప్యూర్ చిత్తూరు యాసలో ఉండేవి. మానిటర్ దగ్గర ఓకె చెప్పే వాళ్లకు ఆ రేంజ్ లో క్లారిటీ ఉంది కాబట్టే నేనూ ఓకె అనేశా…

3 రోజుల్లో కృష్ణ గా మారిపోయా…

ఫస్ట్ 2 రోజుల్లో కొంచెం తడబడ్డా… 3 రోజుల్లో కంప్లీట్ గా కృష్ణలా మారిపోయా… గాంధీ స్క్రిప్ట్ రాసుకునేటప్పుడే ప్రతీది చిత్తూరు యాసలో రాసుకున్నాడు. నన్ను నేను కృష్ణలా మార్చుకోవడానికి, నాకు పెద్దగా టైమ్ పట్టలేదు.

నాగ్ తో సినిమా…

రీసెంట్ గా ఒక సాంగ్ షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఆయనతో పని చేస్తుంటే ఏదో సీనియర్ హీరోతో  పని చేసిన ఫీలింగ్ లేదు.. చాలా ఎంజాయ్ చేస్తున్నా…

అప్పుడే నాని సినిమా…

నేను కొత్త డైరెక్టర్ తో పని చేసినప్పుడే నాని సినిమా అంటారు. అదే ఎస్టాబ్లిష్ డైరెక్టర్ తో చేసినప్పుడు డెఫ్ఫినేట్ గా క్రెడిట్ డైరెక్టర్ కే పోతుంది. ఇది గాంధీ సినిమా…

అందుకే హిప్ హాప్ తమిళ…

హిప్ హాప్ తమిళ తమిళంలో ఒక ఆల్బమ్ చేశాడు అది నాకు చాలా ఇష్టం. దాంతో పాటు ధృవ సాంగ్స్ నాకు చాలా ఇష్టం. గాంధీకి కూడా బిగినింగ్ నుండి అదే ఆలోచన ఉంది. అందుకే హిప్ హాప్ తమిళను ఫిక్స్ చేసుకున్నాం. సాంగ్స్ అయితే ఆల్ రెడీ మీరు విన్నారు కానీ, సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇంకా అద్భుతంగా ఉంటుంది. సినిమాకి ఫ్రెష్ నెస్ తీసుకువచ్చాడు హిప్ హాప్…

ప్రస్తుతానికి తమిళం ఆలోచన లేదు…

ప్రస్తుతానికి తమిళ సినిమా ఆలోచన లేదు. చేస్తే భాష నేర్చుకుని చేయాలి.

 

అనుపమ గురించి…

అనుపమకి స్క్రీన్ కి మధ్య మంచి కెమిస్ట్రీ ఉంది. సీన్  ఏదైనా అవలీలగా నటించేస్తుంది. మనం చూసినప్పుడు కూడా ఓకె అనిపిస్తుంది. కానీ అదే షాట్ మానిటర్ లో చూస్తే అద్భుతం అనిపిస్తుంది. ఈ సినిమాలో తనదొక ఇండిపెండెంట్ స్ట్రాంగ్ రోల్…

రుక్సార్ మీర్ లో బెస్ట్ క్వాలిటీ…

రుక్సార్ లో బెస్ట్ క్వాలిటీ డెడికేషన్. తనకు తెలుగు రాకపోయినా ఎంతలా ప్రాక్టీస్ చేసేదంటే ప్రతి డీటేల్…  ఒక అక్షరాన్ని ఎలా పలకాలో కూడా నేర్చుకుని పలికేది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా అందరం బస్ లో ఏదో చిట్ చాట్ చేస్తుంటే, తను మాత్రం తెలుగులో స్పీచ్ ప్రాక్టీస్ చేస్తూ కూర్చునేది. డెఫ్ఫినేట్ గా అమ్మాయికి మంచి ఫ్యూచర్ ఉంది.

జాగ్రత్తలేమీ తీసుకోవడం లేదు…

నాకెందుకో ప్రేక్షకులకు నాపై సాఫ్ట్ కార్నర్ ఉందనిపిస్తుంది. అది నా అదృష్టం. మామూలుగా ఎవరైనా చిన్న చిన్న మిస్టేక్స్ చేసినా  అంత ఈజీగా క్షమించరు. కానీ నన్ను క్షమించేస్తారు. నా మీద కొంచెం ఎక్కువ ప్రేమ ఉంది కాబట్టే నా సినిమాలు ఆడుతున్నాయి…

నాకే క్లారిటీ లేదు…

ప్రస్తుతానికి 6, 7 స్టోరీస్ డిస్కషన్స్ నడుస్తున్నాయి. అందులో మల్టీ స్టారర్స్ ఉన్నాయి.. రెగ్యులర్ స్టోరీస్ ఉన్నాయి. ఏది ముందు సెట్స్ పైకి వస్తుందో నాకు తెలీదు…

కొరటాల శివతో సినిమా…

ఆ సినిమా గురించి నాక్కూడా ఐడియా లేదు. నేను శివగారిని ‘నిన్నుకోరి’ ఆడియో రిలీజ్ అప్పుడు కలిశాను. మళ్ళీ కలవలేదు. ఈ సినిమాని చెరుకూరి సుధాకర్ ప్రొడ్యూసర్ అని కూడా తెలిసింది ( నవ్వుతూ…)

అదే నాకు ఇంపార్టెంట్…

రెమ్యూనరేషన్ విషయంలో ఎప్పుడూ గ్యారంటీ ఉండదు.  సినిమాలు ఆడితే  మన ప్రమేయం లేకుండానే పెరిగిపోతుంది. ఓ 2 సినిమాలు ఆడకపోతే ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. నా వరకు నేను పర్ఫామెన్స్ వైజ్ గా ఎదిగానా లేదా అనేదే నాకు ఇంపార్టెంట్…

అనిపించిందే చేస్తాం….

ఏదైనా మనకు నచ్చిన కథే చేస్తాం… అది రిలీజయ్యాకే అది హిట్ సినిమా కాదా అనేది తెలుస్తుంది. ఒక్కోసారి కథ విన్నప్పుడు కలిగిన ఫీలింగ్, సినిమా రెడీ అయ్యాక కలగదు, సినిమా ఫ్యూచర్ అప్పుడే తెలిసిపోతుంది. ఒక్కోసారి జనాల్లోకి వెళ్ళాక తెలుస్తుంది.

ఇదే ఫస్ట్ టైమ్…

సమ్మర్ లో నా సినిమా రిలీజవ్వడం ఇదే ఫస్ట్ టైమ్. ‘కృష్ణార్జున యుద్ధం’ డెఫ్ఫినేట్ గా అందరికీ నచ్చే సినిమా అవుతుంది.