ఫ్లాప్-హిట్ సంబంధం లేదు...

Wednesday,December 07,2016 - 11:06 by Z_CLU

ప్రతీ డైరెక్టర్ కి తన కెరీర్ ను మలుపుతిప్పిన ఘన విజయం సాధించిన మైలు రాయి లాంటి ఓ సినిమా ఉండడం సహజమే. అయితే లేటెస్ట్ గా ఓ డైరెక్టర్ మాత్రం తన సినిమాలలో అపజయం గా నిలిచిన ఓ సినిమా తన కెరీర్ లో ది బెస్ట్ అంటున్నాడు. అదేంటి? ఇంతకీ ఎవరా? డైరెక్టర్ అనుకుంటున్నారా..

siv_82030032

     ఆ డైరెక్టర్ మరెవరో కాదు. తక్కువ సినిమాలతోనే స్టార్ డైరెక్టర్ రేస్ లో నిలిచిన సురేందర్ రెడ్డి. ఇప్పటికీ ఓ సినిమా లను డైరెక్ట్ చేసిన సురేందర్ రెడ్డి లేటెస్ట్ గా తన మనసులోని మాటను బయట పెట్టాడు. అతనొక్కడే సినిమా తో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చి ‘కిక్’,’రేసు గుర్రం’ సినిమాలతో ఘన విజయాలు అందుకున్నప్పటికీ తన కెరీర్ లో ది బెస్ట్ సినిమా ‘ఊసరవెల్లి’ అనే అంటున్నాడు. కంటెంట్, మేకింగ్ పరంగా ఊసరవెల్లి ది బెస్ట్ అని హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేదని చెప్పుకొచ్చాడు. ఏదేమైనా కొన్ని ‘ఊసరవెల్లి’ రిలీజ్ టైం లో కాస్త నెగిటీవ్ టాక్ అందుకున్నప్పటికీ తరువాత కాస్త మంచి సినిమా అనే టాక్ అందుకుంది. బహుశా అందుకే ఈ డైరెక్టర్ మనసులో ఆ సినిమా ప్రత్యేకం స్థానం పొందింది…