మరో యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ తో...

Sunday,November 06,2016 - 10:30 by Z_CLU

‘అలా ఎలా’ సినిమాతో టాలీవుడ్ లో కథానాయికగా పరిచయమై ‘కుమారి 21 ఎఫ్’ సినిమాతో యూత్ ఆడియన్స్ ను ఆకట్టుకొని సూపర్ హిట్ అందుకున్న హెబ్బా పటేల్.. మరో యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ తో రెడీ అయింది.  ‘కుమారి 21 ఎఫ్’ తరువాత వరుస ఆఫర్స్ అందుకుంటూ దూసుకుపోతున్న ఈ హాట్ బ్యూటీ తాజా చిత్రం ‘నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్’. దిల్ రాజు సమర్పణలో బెక్కం వేణు గోపాల్ నిర్మిస్తున్న ఈ చిత్రం… టీజర్ తో సోషల్ మీడియాలో మరోసారి హల్ చల్ చేస్తోంది హెబ్బా. షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉన్న ఈ చిత్రంతో మరో సూపర్ హిట్ కొట్టి… హీరోయిన్ గా మరిన్ని ఆఫర్స్ అందుకోవాలని చూస్తుంది.

nanna-nenu-naa-boyfriends-teaser-trailer