అదృష్టం కలిసొస్తుందా...?

Sunday,November 06,2016 - 11:00 by Z_CLU

ప్రస్తుతం టాలీవుడ్ వరుస సినిమాలతో సందడి చేస్తున్న మలయాళ భామ అనుపమ పరమేశ్వర్ వచ్చే ఏడాది సంక్రాంతి కి మరో సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించటానికి రెడీ అవుతుంది. మలయాళ చిత్రం ‘ప్రేమమ్’ తో అందరి చూపు ను ఆకర్షించి త్రివిక్రమ్ ‘అ ఆ’ చిత్రం లో ఛాన్స్ కొట్టేసి టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఆ తరువాత ప్రేమమ్ రీమేక్ లో నూ అలరించి విజయం లో భాగమైంది. ఈ అమ్మడు నటించిన రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు సాధించడం తో ఇప్పుడు అనుపమ నటిస్తున్న మూడో సినిమా పై అందరి చూపు పడింది.
sharwanand-and-anupama-parameswaran-sathamaanam-bhavati
గత రెండు చిత్రాల్లోనూ రెండో కథానాయికగా మాత్రమే కనిపించిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం శర్వానంద్ సరసన ‘శతమానం భవతి’ చిత్రంలో సోలో హీరోయిన్ గా నటిస్తోంది. సంక్రాంతి బరిలో నిలిచిన ఈ సినిమా హిట్ అయితే… సోలో హీరోయిన్ గా తెలుగులో అనుపమకు మరిన్ని ఆఫర్లు రావడం ఖాయం.