ఖైదీ నుంచి మరో లుక్..

Friday,October 28,2016 - 11:15 by Z_CLU

ఈ దీపావళికి మరో మెగా కానుక రిలీజ్ కానుంది. ఫాస్ట్ ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఖైదీ నంబర్ 150 ఇంకో అడుగు ముందుకేసి అభిమానులకు ఇంకాస్త దగ్గర కానుంది. సంక్రాంతి కానుకగా జనవరి 13 న సినిమాని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్న సినిమా యూనిట్… ఈ దీపావళికి మరో లుక్ ని రిలీజ్ చేయనుంది. ఇక ఈ లుక్ లో మెగాస్టార్ ని ఎలా ప్రెజెంట్ చేయనున్నారో తలుచుకుంటేనే అభిమానుల్లో వైబ్రేషన్స్ మొదలైపోయాయి. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ దీపావళికి ఇప్పటికే సూర్య నటిస్తున్న సింగం-3, మహేష్-మురుగదాస్ సినిమా ఫస్ట్ లుక్స్ విడుదల కానున్నాయి. ఇప్పుడు వీటికి పోటీగా ఖైదీ నంబర్-150 కూడా రెడీ అయిపోతోంది.