ఖైదీలో శ్రియ కూడా...?

Friday,October 28,2016 - 11:24 by Z_CLU

మొన్నటివరకు ఠాగూర్ కాంబో రిపీట్ అయిందంటే… అది కేవలం చిరంజీవి-వీవీ వినాయక్ కాంబినేషన్ అని మాత్రమే అనుకున్నాం. కానీ ఠాగూర్ కాంబినేషన్ కు అదనంగా మరో ఎలిమెంట్ కూడా వచ్చి చేరింది. అప్పట్లో ఠాగూర్ సినిమాలో చిరు సరసన ఆడిపాడిన శ్రియ… మెగాస్టార్ లేటెస్ట్ మూవీ ఖైదీ నంబర్-150లో కూడా ఉందట. అయితే ఈ విషయాన్ని మేకర్స్ సీక్రెట్ గా ఉంచుతున్నారు. సినిమాలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో శ్రియ మెరవనుందని తెలుస్తోంది.

shriya-latest-saree-photoshoot-002

ఠాగూర్ లో కేవలం ఆటపాటలకు మాత్రమే శ్రియను ఫిక్స్ చేసిన వినాయక్… ఖైదీనంబర్-150లో మాత్రం ఆమెకు మంచి క్యారెక్టర్ ఆఫర్ చేశాడట. ప్రస్తుతం శ్రియ… బాలయ్య సరసన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలో నటిస్తోంది. ఇప్పుడు చిరంజీవి సినిమాలో కూడా నటిస్తోందనే వార్తతో… ఆమె మళ్లీ టాలీవుడ్ లో బిజీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.