ఫుల్ స్వింగ్ లో ఓం నమో వెంకటేశాయ ప్రమోషన్స్

Friday,January 27,2017 - 06:05 by Z_CLU

టాలీవుడ్ లో ఓం నమో వెంకటేశాయ నామస్మరణ అప్పుడే ఊపందుకుంది. ఫిబ్రవరి 10 న రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రమోషన్ ని స్లోగానే ఫుల్ స్వింగ్ లోకి తీసుకొస్తున్నాడు నాగ్. రీసెంట్ గా సౌరబ్ జైన్ తో కలిసి ఫోటోని రిలీజ్ చేసిన నాగ్, ఇప్పుడు ప్రగ్యా జైస్వాల్ తో దిగిన స్టిల్స్ ని పోస్ట్ చేశాడు.

అల్టిమేట్ డివోషనల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఓం నమో వెంకటేశాయ లో అనుష్క శెట్టి, ప్రగ్యా జైస్వాల్ ఇంపార్టెంట్ రోల్స్ లో కనిపించనున్నారు. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందించాడు.

nagarjuna-om-namo-venkatesaya

రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రేలర్, సాంగ్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. దానికి తోడు రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ ఫుల్ ఫ్లెజ్డ్ గా ప్రమోషన్స్ లో పాల్గొనే ప్లానింగ్ లో ఉంది సినిమా యూనిట్.