#Akhanda బాలయ్య సినిమా ఎప్పుడంటే ?

Thursday,October 21,2021 - 05:05 by Z_CLU

చాలా రోజులైంది ప్రేక్షకులు ఓ పక్కా మాస్ కమర్షియల్ సినిమా చూసి. అందుకే ఎప్పటి నుండో బాలయ్య -బోయపాటి కాంబో సినిమా ‘అఖండ‘ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. బాలయ్య పంచె కట్టు కట్టుకొని ఓ డైలాగ్ చెప్పే టీజర్ వదిలినప్పటి నుండి సినిమాపై భారీ అంచనాలు మొదలయ్యాయి. ఇక ఇటివలే వచ్చిన మరో టీజర్ ఎవరూ ఊహించని అఘోర గెటప్ లో కనిపించి పవర్ ఫుల్ డైలాగ్ తో ఆ అంచనాలను మరోస్తాయికి చేర్చాడు. దీంతో ఇప్పుడు మాస్ ప్రేక్షకులు ఈ సినిమా రిలీజ్ డేట్ కోసం చూస్తున్నారు. థియేటర్స్ లో బాలయ్య డైలాగులు , యాక్షన్ ఎపిసోడ్స్ చూస్తూ విజిల్స్ క్లాప్స్ కొట్టేందుకు రెడీ అవుతున్నారు.

నిజానికి అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ దసరా కే ‘అఖండ’ రిలీజ్ అయ్యేది. కానీ ఫస్ట్ కాపీ ఇంకా రెడీ అవ్వలేదు. ప్రస్తుతం యూనిట్ అదే పనిలో ఉన్నారు. ఓ రెండు వారాల్లోనే ఫస్ట్ కాపీ రెడీ అవుతుందని సమాచారం. ఇక ఆంధ్రప్రదేశ్ లో ఇటివలే 100 % ఆక్యుపెన్సీ కూడా ఇచ్చేశారు. సో ఇంకా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి ప్రమోషన్ మొదలు పెట్టడమే ఆలస్యం. ఇక వచ్చే నెల నవంబర్ మొదటి వారంలో అలాగే నెలాఖరున రెండు డేట్స్ పరీశీలిస్తున్నారట. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేసే అవకాశం ఉంది.

సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ ఓ రేంజ్ లో ఉంటాయని ఇప్పటికే టాక్ వినబడుతుంది. బోయపాటి మార్క్ యాక్షన్ తో బాలయ్య చెలరేగిపోనున్నాడని టీజర్ తోనే క్లారిటీ వచ్చేసింది.మరి బాలయ్య -బోయపాటి కాంబినేషన్ లో మూడో సినిమాగా వస్తున్న ఈ సినిమా భారీ అంచనాలను ఎందుకొని ఘన విజయం అందుకుంటుందా ? చూడాలి. ద్వారకా క్రియేషన్స్ బేనర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్య జైస్వాల్ , పూర్ణ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. తమన్ కంపోజ్ చేసిన ఆల్బంలో మరో పాట త్వరలోనే రిలీజ్ అవ్వనుంది.

– Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics