శర్వానంద్ -సమంత '96'... మార్చ్ నుండి

Sunday,January 27,2019 - 09:37 by Z_CLU

హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు నిర్మాణంలో 34వ చిత్రంగా రూపొంద‌నున్న సినిమాలో శ‌ర్వానంద్‌, స‌మ‌త హీరో హీరోయిన్లుగా న‌టించ‌నున్నారు. త‌మిళంలో విజ‌య్ సేతుప‌తి, త్రిష న‌టించి ఘ‌న విజ‌యం సాధించిన చిత్రం `96`కు రీమేక్‌గా ఈ చిత్రం తెర‌కెక్క‌నుంది.

`96` చిత్రాన్ని డైరెక్ట్ చేసిన సి.ప్రేమ‌కుమార్ తెలుగు రీమేక్‌ను కూడా డైరెక్ట్ చేయబోతున్నాడు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. మార్చి నుండి సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాలో న‌టించ‌బోయే న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే ప్రకటించనున్నారు మేకర్స్.