జై పాత్రకు దగ్గరగా ఎన్టీఆర్ క్యారెక్టర్

Saturday,February 16,2019 - 01:28 by Z_CLU

జై లవకుశ సినిమాలో మూడు పాత్రల్లో కనిపించి మెప్పించాడు యంగ్ టైగర్. ఇందులో జై పాత్ర నెగెటివ్ షేడ్స్ లో నడుస్తుంది. ఆ పాత్ర కోసం ఎన్టీఆర్ కాస్త బరువు కూడా పెరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే పాత్ర ఛాయల్లో రాజమౌళి దర్శకత్వంలో చేయబోతున్న సినిమా కూడా ఉంటుందట.

రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా వస్తోంది ఆర్-ఆర్-ఆర్. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర మోస్ట్ ఎగ్రెసివ్ గా ఉంటుందట. ఈ క్యారెక్టర్ కోసం ఇప్పటికే కాస్త లావెక్కిన ఎన్టీఆర్, మరింత బరువు పెరగాలని భావిస్తున్నాడు. గడ్డం కూడా ఫుల్ గా పెంచుతాడట. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం, ఈ సినిమాలో ముస్లిం యువకుడిగా కనిపించబోతున్నాడట తారక్

ఇక సినిమాకు సంబంధించి చక్కర్లు కొడుతున్న మరో గాసిప్ ఏంటంటే.. ఈ సినిమా లో చరణ్ లుక్ ను అతడి పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న విడుదల చేస్తారట. గతంలో బాహుబలి-2 టైమ్ లో రాజమౌళి ఇలానే చేశాడు. హీరోహీరోయిన్ల బర్త్ డేల సందర్భంగా ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేశాడు. ఆర్-ఆర్-ఆర్ కు కూడా అదే ఫార్ములా ఫాలో అవుతాడేమో.