హాట్ టాపిక్: నిర్మాతగా యంగ్ టైగర్?

Monday,March 23,2020 - 01:33 by Z_CLU

రామ్ చరణ్ నిర్మాతగా మారాడు. మహేష్ కూడా ప్రొడ్యూసర్ గా మారిపోయాడు. పవన్ కల్యాణ్ కూడా నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. మరి నెక్ట్స్ ఎవరు?

లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం త్వరలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ నిర్మాతగా మారబోతున్నాడట. ప్రస్తుతం ఫిలింనగర్ లో హాట్ టాపిక్ ఇదే. తన నెక్ట్స్ మూవీకి (కెరీర్ లో 30వ సినిమా) ఎన్టీఆర్ సహ-నిర్మాతగా వ్యవహరిస్తాడని అంటున్నారు.

త్రివిక్రమ్ దర్శకత్వంలో హారిక-హాసిని బ్యానర్ పై ఎన్టీఆర్ ఓ మూవీ చేయబోతున్నాడు. ఈ సినిమాకు కో-ప్రొడ్యూసర్ గా మారాలనే ఆలోచనలో ఉన్నాడట తారక్. ఇంతకుముందు గీతాఆర్ట్స్ తో కలిసి అల వైకుంఠపురములో సినిమా నిర్మించింది హారిక-హాసిని సంస్థ. ఇప్పుడు ఎన్టీఆర్ పెట్టబోయే కొత్త బ్యానర్ తో కలిసి సినిమా నిర్మిస్తుందేమో చూడాలి.

అన్నట్టు తన తండ్రిని స్మరించుకుంటూ నందమూరి హరికృష్ణ ఆర్ట్స్ అనే పేరిట బ్యానర్ పెట్టాలని యంగ్ టైగర్ అనుకుంటున్నాడట.