ఉప్పెన హీరోయిన్ కు వరుసగా ఆఫర్లు

Monday,March 23,2020 - 01:12 by Z_CLU

ఉప్పెన సినిమా ఇంకా థియేటర్లలోకి రాలేదు. కానీ ఆ సినిమాతో హీరోయిన్ గా పరిచయం కాబోతున్న కృతి షెట్టికి మాత్రం బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు వస్తున్నాయి. ఉప్పెన రిలీజ్ అవ్వకముందే అప్పుడే తన మూడో మూవీ ఆఫర్ అందుకుంది ఈ బ్యూటీ.

రీసెంట్ గా పాగల్ అనే సినిమా లాంఛ్ చేశాడు విశ్వక్ సేన్. ఇందులో హీరోయిన్ గా ఆల్రెడీ సిమ్రాన్ చౌదరి (ఈ నగరానికి ఏమైంది ఫేమ్)ని హీరోయిన్ గా తీసుకున్నారు. ఇప్పుడు మరో హీరోయిన్ గా కృతి శెట్టిని సెలక్ట్ చేశారు.

గీతాఆర్ట్స్2 బ్యానర్ పై రాబోతున్న 18-పేజెస్ అనే సినిమాలో ఆల్రెడీ ఈ ముద్దుగుమ్మను హీరోయిన్ గా తీసుకున్నారు. త్వరలోనే నిఖిల్ తో కలిసి ఆమె సెట్స్ పైకి రాబోతోంది. ఇప్పుడు విశ్వక్ సేన్ మూవీకి కూడా సెలక్ట్ అయింది.

రిలీజ్ కు ముందే ఈ బ్యూటీ ఇంత స్పీడ్ గా ఉందంటే.. ఉప్పెన రిలీజ్ తర్వాత ఈమె స్టార్ హీరోయిన్ల రేసులోకి ఎంటరైనా ఆశ్చర్యపోనక్కర్లేదేమో