ఎన్టీఆర్ కొత్త సినిమా షూటింగ్ స్టార్ట్

Monday,February 20,2017 - 10:40 by Z_CLU

యంగ్ టైగర్ ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎన్టీఆర్ కొత్త సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయింది. కల్యాణ్ రామ్ నిర్మాతగా బాబి దర్శకత్వంలో ఈ సినిమా సెట్స్ పైకి వచ్చింది. అయితే మొదటి షెడ్యూల్ కు ఎన్టీఆర్ మాత్రం ఎటెండ్ కాలేదు. కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులతో కొన్ని సీన్లు పిక్చరైజ్ చేస్తున్నారు. మార్చి రెండో వారం నుంచి ఎన్టీఆర్ సెట్స్ పైకి వస్తాడు.

ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ముస్తాబవుతున్నాడు ఎన్టీఆర్. ఇప్పటికే బాగా జుట్టు పెంచాడు. మరోవైపు ఫిజికల్ ట్రయినర్ నేతృత్వంలో భారీ వర్కవుట్స్ చేస్తున్నాడు. మేకోవర్ పూర్తయిన తర్వాతే సెట్స్ పైకి రావాలని అనుకుంటున్నాడు. ఈ సినిమాలో యంగ్ టైగర్, 3 డిఫరెంట్ గెటప్స్ లో కనిపించబోతున్నాడనే టాక్ నడుస్తోంది. ఇక సినిమా టైటిల్ విషయంలో కూడా జై లవకుశ అనే టైటిల్ పై స్పెక్యులేషన్ జోరుగా సాగుతోంది.

ఇక సినిమాలో ముగ్గురు ఎన్టీఆర్స్ కోసం ముగ్గురు ముద్దుగుమ్మల వేట మొదలైంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టులోకి రాశి ఖన్నాను హీరోయిన్ గా తీసుకున్నారు. జెంటిల్ మేన్ ఫేం నివేదా థామస్ ను మరో హీరోయిన్ గా తీసుకునే ఆలోచనలో ఉన్నారు. మూడో హీరోయిన్ కోసం వేట సాాగుతోంది. ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకుడు.