బాలయ్య సినిమాపై ఇంట్రెస్టింగ్ రూమర్...

Monday,February 20,2017 - 11:35 by Z_CLU

గౌతమీపుత్ర శాతకర్ణి గ్రాండ్ సక్సెస్ తర్వాత ఇప్పటివరకు మరో సినిమా ఎనౌన్స్ చేయలేదు నటసింహం నందమూరి బాలకృష్ణ. తండ్రి ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా ఓ బయోపిక్ తీస్తానని ప్రకటించినప్పటికీ… 101వ సినిమా అది వస్తుందా రాదా అనే విషయంపై బాలయ్య క్లారిటీ ఇవ్వలేదు. ఈ గ్యాప్ లో బాలయ్య అప్ కమింగ్ మూవీపై మరో ఇంట్రెస్టింగ్ మేటర్ చక్కర్లు కొడుతోంది.

తన కెరీర్ కు అద్భుతంగా కలిసొచ్చిన ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ ను బాలయ్య మరోసారి సెలక్ట్ చేసుకున్నారనేది తాజా టాక్. తన 101వ సినిమా కోసం ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ లో ఓ కథను బాలయ్య ఎంచుకున్నారని అంటున్నారు. అయితే ఈ ప్రాజెక్టుకు డైరక్టర్ ఎవరనే విషయంపై మాత్రం బజ్ లేదు. మరోవైపు ఇదే సినిమాలో తమన్నను హీరోయిన్ గా తీసుకునే ఛాన్స్ ఉందని కూడా పుకార్లు వస్తున్నాయి.

రీసెంట్ గా బాలకృష్ణను, టి.సుబ్బరామిరెడ్డి సత్కరించారు. వందో సినిమా బిగ్ హిట్ అయినందుకు తన హోటల్ లో బాలకృష్ణను సన్మానించారు. ఈ కార్యక్రమానికి ఎవరూ ఊహించని విధంగా మిల్కీ బ్యూటీ తమన్న ఎటెండ్ అయింది. పైగా బాలయ్యతో ఓ సినిమా చేయాలనుందంటూ తన మనసులో మాట కూడా బయటపెట్టింది. అందుకే 101వ సినిమాలో తమన్నను హీరోయిన్ గా తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది.