జీ సినిమాలు ( ఫిబ్రవరి 20th)

Sunday,February 19,2017 - 10:07 by Z_CLU

నటీనటులు : అక్కినేని నాగేశ్వరరావు, జయప్రద

ఇతర నటీనటులు : గుమ్మడి, సత్యనారాయణ, అల్లు రామలింగయ్య, నగేష్, చలం, సారథి, జయప్రద, అంబిక తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : K.V. మహదేవన్

డైరెక్టర్ : దాసరి నారాయణ రావు

ప్రొడ్యూసర్ : డి. రామా నాయుడు

రిలీజ్ డేట్ : 1981

ఆకాశ హర్మ్యంలో ఉన్న జమీందారీ వ్యవస్థకు, నేలకున్న దేవదాసీ వ్యవస్థకు మధ్య జరిగే ఆసక్తికరమైన  ప్రేమకథే ప్రేమ మందిరం. ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం హైలెట్ గా నిలిచింది.

=============================================================================

నటీనటులు : శ్రీహరి, రాజా, గజాల, నిఖిత

ఇతర నటీనటులు : బాలాదిత్య, ముకేష్ రిషి, జయప్రకాశ్ రెడ్డి, రంగనాథ్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : మణి శర్మ

డైరెక్టర్ : మల్లికార్జున్

ప్రొడ్యూసర్ : శివకుమార్

రిలీజ్ డేట్ : 6 మార్చి 2008

భద్రాది అనేది అమలాపురం దగ్గర ఒక చిన్న పల్లెటూరు. ఎప్పుడూ పచ్చటి పొలాలతో కళకళలాడుతూ ఉండే భద్రాద్రి ONGC వల్ల వచ్చే గ్యాస్ వల్ల, అక్కడి వాతావరణం కాలుష్యం అయి, దాదాపు స్మశానంలా  తయారవుతుంది. అప్పుడు రఘు రామ్ ( శ్రీ హరి ) ఏం చేశాడు..? తన ఊళ్ళో పరిస్థితులు బాగు చేయడానికి శ్రీహరి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడు అనేదే ప్రధాన కథాంశం.

==============================================================================

నటీ నటులు : నాని, శరణ్య మోహన్

ఇతర నటులు : కిషోర్, ధనరాజ్, వినయ్, సంతోష్, శివ, రమేష్, కృష్ణ, చంటి

మ్యూజిక్ డైరెక్టర్  : V. సెల్వ గణేష్

డైరెక్టర్ : తాతినేని సత్య

నిర్మాత : NV ప్రసాద్, పరాస్ జైన్

తమిళంలో సూపర్ హిట్టయిన ‘వెన్నిల కబడీ కుజు’ సినిమాను భీమిలి కబడ్డీ జట్టు గా తెరకెక్కించారు. వైజాగ్ పరిసర ప్రాంతమైన భీమిలి పరిసర ప్రాంతాల్లో జరిగే సెన్సిటివ్ కథగా తెరకెక్కింది భీమిలి కబడ్డీ జట్టు. సెన్సిటివ్ ప్రేమ కథతో మొదలైన కథే అయినా, తన జట్టును గెలిపించడం కోసం, ఆఖరి శ్వాస వరకు పోరాడే యువకుడి క్యారెక్టర్ లో నాని నటన అద్భుతం.

=============================================================================

నటీ నటులు : నందమూరి బాలకృష్ణ, సిమ్రాన్, అనుష్క శెట్టి

ఇతర నటీనటులు : నిషా కొఠారి, అశుతోష్ రానా, రవి కాలె, సలీం బేగ్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ

డైరెక్టర్ : Y.V.S.చౌదరి

ప్రొడ్యూసర్ :  Y.V.S.చౌదరి

రిలీజ్ డేట్ : 11 జనవరి 2008

బాలకృష్ణ, అనుష్క, సిమ్రాన్ నటించిన కలర్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఒక్క మగాడు. ఈ సినిమా పూర్తిగా బాలక్రిష్ణ మార్క్ కథాంశంతో తెరకెక్కింది. ఈ సినిమాలో బాలకృష్ణ మ్యానరిజం హైలెట్ గా నిలుస్తుంది. Y.V.S. చౌదరి డైరెక్షన్  చేసిన ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందించాడు.

=============================================================================

నటీనటులు – రామ్,కాజల్

ఇతర నటీనటులు – పూనమ్ కౌర్, ఆశిష్ విద్యార్థి, బ్రహ్మానందం

మ్యూజిక్ డైరెక్టర్    – మిక్కీ జె మేయర్

దర్శకత్వం  –  శరవణన్

విడుదల తేదీ – 2009

రామ్ కాజల్ జంటగా తెరకెక్కిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ‘గణేష్ జస్ట్ గణేష్’. 2009 లో విడుదలైన ఈ సినిమా యువతతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా ఆకట్టుకుంది. మిక్కీ జె మేయర్ అందించిన సంగీతం ఈ సినిమాకు హైలైట్. చిన్న పిల్లలతో గణేష్ చేసే హంగామా , కాజల్-రామ్ మధ్య వచ్చే లవ్ సీన్స్ బాగా అలరిస్తాయి. అబ్బూరి రవి అందించిన మాటలు సినిమాకు ప్లస్, ముఖ్యంగా క్లైమాక్స్ లో మాటలు అందరినీ ఆకట్టుకుంటాయి. కాజల్ కుటుంబ సభ్యుల మధ్య మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు అందరినీ హత్తుకుంటాయి.

==============================================================================

హీరోహీరోయిన్లు – రవితేజ,  చార్మి

ఇతర నటీనటులు –  డైజీ బోపన్న, అతుల్ కులకర్ణి, రేవతి, రఘుబాబు, సుబ్బరాజు, వేణుమాధవ్

సంగీతం – శ్రీ

దర్శకత్వం – శోభన్

విడుదల తేదీ – 2004, నవంబర్ 12

హీరో రవితేజ అప్పటికే పూర్తిస్థాయి హీరోగా ఎస్టాబ్లిష్ అయిపోయాడు. అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, ఇడియట్, ఖడ్గం, ఇట్లు శ్రావణి  సుబ్రమణ్యం లాంటి హిట్స్ ఉన్నాయి. మరోవైపు శోభన్ వర్షం సినిమాతో దర్శకుడిగా తన ప్రతిభ చాటుకున్నాడు. అలా వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ చంటి. చార్మి హీరోయిన్  గా నటించిన ఈ సినిమాకు శ్రీ సంగీతం అందించాడు. దర్శకుడు  శోభన్ కు ఇదే ఆఖరి చిత్రం. ఈ సినిమా తర్వాత కన్నడంలో మరో సినిమా ఎనౌన్స్ చేసినప్పటికీ… అది సెట్స్ పైకి వెళ్లకముందే తీవ్రమైన గుండెపోటుతో శోభన్ చనిపోయారు. అదే ఏడాది శోభన్ సోదరుడు, ప్రముఖ కమెడియన్ లక్ష్మీపతి కూడా కన్నుమూయడం బాధాకరం.

=============================================================================

 

నటీనటులు – రాజా, పూనమ్ బజ్వా

ఇతర నటీనటులు – కె.విశ్వనాథ్, సుధ, నరేష్, అను మెహతా, సత్యంరాజేష్

సంగీతం – అనూప్ రూబెన్స్

దర్శకత్వం – వి.జితేందర్

విడుదల తేదీ – 2007

ఓ చినదాన సినిమాతో హీరోగా పరిచయం అయిన రాజా… మినిమం గ్యారెంటీ హిట్స్ తో దూసుకుపోతున్న టైమ్ లో తీసిన చిత్రం వేడుక. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో పాటలన్నీ బాగుంటాయి. 2007లో హిట్ అయిన సినిమాల్లో వేడుక కూడా ఒకటి.