రాజమౌళి సినిమాలో ఎన్టీఆర్ లుక్

Saturday,March 10,2018 - 01:09 by Z_CLU

రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న మల్టీస్టారర్ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించబోతున్నారనే విషయం తెలిసిందే. ఈ సినిమా టెస్ట్ షూట్ కోసం వీళ్లిద్దరూ కలిసి అమెరికా వెళ్లారు. తాజాగా వినిపిస్తున్న రూమర్స్ ప్రకారం.. ఈ సినిమాలో ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ లో కనిపిస్తాడట.

ఇప్పటికే త్రివిక్రమ్ సినిమా కోసం ఫిట్ గా తయారయ్యాడు ఎన్టీఆర్. సెలబ్రిటీ ఫిట్ నెస్ ట్రయిలర్ లాయిడ్ స్టీవెన్ పర్యవేక్షణలో అల్ట్రా మోడ్రన్ లుక్ లోకి మారాడు. అయితే ఈ లుక్ తో పాటు సిక్స్ ప్యాక్ లుక్ కోసమే అమెరికాకు వెళ్లినట్టు తెలుస్తోంది. అటు రామ్ చరణ్ పై కూడా టెస్ట్ షూట్ షురూ అయింది.

అన్నీ అనుకున్నట్టు జరిగితే ఆగస్ట్ నుంచి చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో రాజమౌళి దర్శకత్వంలో మల్టీస్టారర్ మొదలవుతుంది. ఈ సినిమాలో హీరోలిద్దరూ అన్నదమ్ములుగా కనిపించనున్నారనే టాక్ నడుస్తోంది.