కృష్ణ, అర్జున్ కలిసి కుమ్మేశారు

Saturday,March 10,2018 - 12:33 by Z_CLU

నానికి నేచురల్ స్టార్ అనే బిరుదు ఎందుకొచ్చిందో తెలుసా. అతడి రీసెంట్ సినిమాలు చూస్తే ఈ విషయం అర్థమౌతుంది. ఇప్పుడు దీనికి మరింత జస్టిఫికేషన్ ఇచ్చేలా తెరకెక్కుతోంది కృష్ణార్జున యుద్ధం. ఈ సినిమా టీజర్ రిలీజ్ అయింది. డ్యూయల్ రోల్ లో నాని ది బెస్ట్ అనిపించుకున్నాడు.

కృష్ణార్జున యుద్ధంలో కృష్ణ అనే మాస్ పాత్రలో, అర్జున్ అనే రాక్ స్టార్ క్యారెక్టర్ లో కనిపించాడు నాని. రెండూ వేటికవే డిఫరెంట్. అయినప్పటికీ నానిలో ఎక్కడా తడబాటు లేదు. అదే ఈజ్. అదే ఉత్సాహం. సేమ్ కామెడీ టైమింగ్. కుమ్మేశాడంతే.

ఈ సినిమాను ఏప్రిల్ 12న గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై మేర్లపాక గాంధీ డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, రుక్సార్ మిర్ హీరోయిన్లు. హిపాప్ తమీజా సంగీతం అందిస్తున్నాడు.