ఆ సెంటిమెంట్ ను తొక్కిపడేశారు...

Tuesday,September 13,2016 - 07:00 by Z_CLU

 

టాలీవుడ్ లో ఎప్పటి నుంచో ఓ బ్యాడ్ సెంటిమెంట్ ఉంది. దర్శకుడి గా ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతో మంచి విజయం అందుకున్న యువ దర్శకులు రెండో సినిమాతో ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేయలేరనే నెగెటివ్ సెంటిమెంట్ బలంగా ఉంది. అయితే ఇప్పుడిప్పుడు ఆ సెంటిమెంట్ ను క్రాస్ చేస్తున్నారు యంగ్ అండ్ టాలెంటెండ్ డైరక్టర్లు. రెండో సినిమాతో కూడా హిట్ కొట్టి శభాష్ అనిపించుకున్నారు.

avasarala-srinivas2

నటుడిగా మంచి అవకాశాలు అందుకుంటున్న సమయంలో ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రం తో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు అవసరాల శ్రీనివాస్. తొలి సినిమాతోనే దర్శకుడిగా తానేంటో నిరూపించుకున్నాడు. ఇక తొలి విజయం అందుకోగానే కంగారు పడకుండా మరో మంచి కథతో దర్శకుడిగా ప్రేక్షకుల ముందుకు రావాలనుకొని… తాజాగా ‘జ్యో అచ్యుతానంద’ సినిమాను తెరకెక్కించాడు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో నడుస్తోంది. అలా మొదటి సినిమా కంటే రెండో సినిమాకే ఎక్కువ ప్రశంసలు అందుకుంటున్నాడు ఈ దర్శకుడు.

anil-ravi-pudi

కళ్యాణ్ రామ్ కు ‘పటాస్’ రూపం లో గ్రాండ్ హిట్ అందించాడు యువ దర్శకుడు అనిల్ రావిపూడి. ఓ సీనియర్ హీరో ను మళ్ళీ సక్సెస్ ట్రాక్ లో నిలబెట్టిన అనిల్ ఆ వెంటనే ‘సుప్రీమ్’ తో దర్శకుడిగా మరో విజయాన్ని అందుకున్నాడు. సాయి ధరమ్ తేజ్ తో రూపొందించిన సుప్రీమ్ సినిమా తేజు కెరీర్ లోనే అధిక వసూళ్లను సాధించింది.రెండు హిట్స్ తో తానేంటో నిరూపించుకున్న అనిల్ రావిపూడి… త్వరలోనే రామ్ సినిమాతో హ్యాట్రిక్ కొట్టేందుకు రెడీ అవుతున్నాడు.

merlapaka-gandhi-1030x684

ఇక ఈ లిస్టులో యువ దర్శకుడు మేర్లపాక గాంధీ కూడా ఉన్నాడు. ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ తో ఎక్స్ ప్రెస్ లాంటి స్క్రీన్ ప్లే తో టాలీవుడ్ లోకి దూసుకొచ్చిన ఈ దర్శకుడు మొదటి సినిమాతో అటు ప్రేక్షకులను ఇటు పరిశ్రమ ను ఆకట్టుకున్నాడు. ఇక రెండో సినిమాకు కాస్త గ్యాప్ తీసుకొని మరో ఎక్స్ ప్రెస్ లాంటి కథ తో ‘ఎక్స్ ప్రెస్’ రాజా గా సంక్రాంతి బరి లో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక రెండు విజయాల ఉత్సాహం తో మూడో సినిమాకు సిద్దమవుతున్నాడు ఈ దర్శకుడు.

kranthi-madhav

తెలుగుదనం ఉట్టిపడే సినిమాతో దర్శకుడిగా ‘ఓనమాలు’ దిద్దుకొని ఆ సినిమాతో ప్రేక్షకులను అలరించి అందరి మనసులో ఓ మంచి అనుభూతి కలిగించిన దర్శకుడు దర్శకుడు క్రాంతి మాధవ్. ఈ మూవీ తర్వాత రెండోసారి అందమైన ప్రేమకథతో ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ అంటూ మంచి విజయం అందుకున్నాడు. ఇలా వరుసగా రెండు హిట్స్ కొట్టిన ఈ దర్శకుడు.. ప్రస్తుతం సునీల్ తో మూడో సినిమాను రూపొందిస్తున్నాడు.