NTR BuchiBabu Movie - హీరోయిన్ ఫిక్స్ అయిందా?

Thursday,January 27,2022 - 07:59 by Z_CLU

NTR BuchiBabu Movie (#NTR31) Pre Production work Starts

రామ్ చరణ్ తో కలిసి రాజమౌళి దర్శకత్వంలో ‘RRR’సినిమా చేసిన ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమాను స్టార్ట్ చేసే ప్రాసెస్ లో ఉన్నాడు. నెక్స్ట్ తన 30వ సినిమాను కొరటాల శివ డైరెక్షన్ లో చేయబోతున్న ఎన్టీఆర్ ఆ తర్వాతి సినిమాను బుచ్చిబాబు సాన దర్శకత్వంలో చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఉప్పెన తో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన బుచ్చిబాబు తారక్ కోసం ఒక కథ రెడీ చేస్తున్నాడు.

ఇప్పటికే రెండు మూడు సార్లు ఎన్టీఆర్ కి నరేషన్ ఇచ్చాడు బుచ్చి బాబు. ప్రస్తుతం స్క్రిప్ట్ కి తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్నారు. మైత్రి మూవీ మేకర్స్ బేనర్ పై తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మరో వైపు కాస్టింగ్ కూడా ఫైనల్ చేసే పనిలో ఉన్నారు. ఎన్టీఆర్ సరసన శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ని ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది.

జాన్వి టాలీవుడ్ ఎంట్రీ గురించి ఎప్పటి నుండో డిస్కషన్స్ జరుగుతున్నాయి. బోణీ కపూర్ తో ఇప్పటికే చాలా మంది దర్శక నిర్మాతలు మాట్లాడుతున్నారు. టాలీవుడ్ లో శ్రీదేవి కి ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని జాన్విని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాలని చూస్తున్నారు. మరి అన్ని అనుకున్నట్లు జరిగితే జాన్వి తెలుగు సినిమా #NTR31 అయ్యే అవకాశం ఉంది.

janhvi kapoor latest stills