రానాను ఆకాశానికెత్తేసిన ఎన్టీఆర్

Thursday,March 30,2017 - 12:24 by Z_CLU

దగ్గుబాటి రానా, ఎన్టీఆర్.. చిన్నప్పట్నుంచి ఫ్రెండ్స్ వీళ్లిద్దరూ. హీరోలుగా ఎదిగిన తర్వాత కూడా అదే ఫ్రెండ్ షిప్ మెయింటైన్ చేస్తున్నారు. ఇద్దరి మధ్య ఎలాంటి ఇగోస్, అభిప్రాయబేధాలు లేవనే దానికి తాజాగా జరిగిన ఓ ఇన్సిడెంట్ బెస్ట్ ఎగ్జాంపుల్ గా నిలుస్తుంది.

ఐఫా ఉత్సవంలో బెస్ట్ హీరో అవార్డు అందుకున్నాడు ఎన్టీఆర్. ఈ వేడుకకు రానా, నాని యంకరింగ్ చేశారు. అవార్డు అందుకున్న ఎన్టీఆర్.. తనకు అవార్డు ఇచ్చినందుకు థ్యాంక్స్ చెబుతూనే, వేదికపై ఉన్న రానాను ప్రత్యేకంగా మెచ్చుకున్నాడు.

ఏ క్యారెక్టర్ అయినా పండించగల అతికొద్దిమంది నటుల్లో రానా ఒక్కడని యంగ్ టైగర్ మెచ్చుకున్నాడు. బాహుబలి సినిమాలో డైలాగ్ డెలివరీ, యాక్టింగ్ చూసి రానాకు ఫిదా అయిపోయానని ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు. ఎన్టీఆర్ గ్యాాప్ లేకుండా తనను పొగిడేస్తుంటే.. రానా ఉబ్బితబ్బిబ్బయ్యాడు.