ఫస్ట్ లుక్ విషయంలో రియాక్ట్ అయిన మహేష్ బాబు

Thursday,March 30,2017 - 01:13 by Z_CLU

మహేష్ బాబు A.R. మురుగదాస్ సినిమా జూన్ 23 న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. సినిమా సెట్స్ పైకి వచ్చి ఇన్నాళ్ళు గడుస్తున్నా, కనీసం టైటిల్ కాదు కదా ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయలేదు సినిమా యూనిట్. దాంతో మహేష్ బాబు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కాస్త సీరియస్ గానే రియాక్ట్ అవుతున్నారు.

నిన్నటికి నిన్న… ఉగాది పండగ సందర్భంగా మహేష్ బాబు సినిమాకి సంబంధించి కనీసం ఫస్ట్ లుక్ అయినా రిలీజ్ అవుతుందేమోనని ఎక్స్ పెక్ట్ చేసిన ఫ్యాన్స్ కి ఒకరకంగా డిజప్పాయింట్ మెంటే మిగిలింది. అందుకే అంత బిజీ షెడ్యూల్స్ లోను ఫ్యాన్స్ ని ఉద్దేశించి రిక్వెస్టింగ్ ట్వీట్ చేశాడు మహేష్ బాబు.

డే అండ్ నైట్ షూటింగ్స్ లో బిజీగా ఉన్న సినిమా యూనిట్, ఫస్ట్ లుక్ విషయంలో అంతగా టైం స్పెండ్ చేయలేకపోతుందని, దయచేసి ఇంకొన్ని రోజులు ఓపిక పట్టమని రిక్వెస్ట్ చేశాడు సూపర్ స్టార్. తమ క్యూరాసిటీని అర్థం చేసుకున్నందుకు సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి కాస్తంత ఊరట కలిగినా, కనీసం ఈ సారి కూడా ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ కానీ, టైటిల్ కానీ… అసలెప్పుడు ఎక్స్ పెక్ట్ చేయొచ్చో కూడా క్లారిటీ ఇవ్వకపోవడంతో ఇంకా డిజప్పాయింట్ మోడ్ లోనే ఉన్నారు ఫ్యాన్స్ .