నితిన్ 'లై' ఫస్ట్ లుక్

Thursday,March 30,2017 - 11:38 by Z_CLU

బర్త్ డే రోజు ఫస్ట్ లుక్ రివీల్ చేస్తానని ప్రామిస్ చేసినట్టుగానే నితిన్ తన నెక్స్ట్ సినిమా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసేశాడు. గుబురు గడ్డంలో నిండుగా, అగ్రెసివ్ గా ఎట్రాక్ట్ చేస్తున్న నితిన్ లుక్స్ తో పాటు, ఈ సినిమా టైటిల్ కూడా అంతగానే ఎట్రాక్ట్ చేస్తుంది. Love, Intelligence, Enmity మెయిన్ ఎలిమెంట్స్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కి ‘LIE’ అని టైటిల్ ని ఫిక్స్ చేసుకుంది సినిమా యూనిట్.

రామ్ ఆచంట, గోపీ ఆచంట, అనిల్ సుంకర కలిసి నిర్మిస్తున్న ఈ బారీ బడ్జెట్ సినిమా ఆల్ రెడీ ఓ షెడ్యూల్ కి ప్యాకప్ చెప్పేసింది. నెక్స్ట్ షెడ్యూల్ ని ఏప్రియల్ 4 నుండి అమెరికాలో ప్లాన్ చేసుకున్న సినిమా యూనిట్, వరసగా వెగాస్, లాస్ ఏంజిల్స్, శాన్ ఫ్రాన్సిస్కో, చికాగో లాంటి బ్యూటీఫుల్ లొకేషన్స్ లో సినిమాని తెరకెక్కించనున్నారు.

మణిశర్మ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమాలో మేఘా ఆకాశ్ హీరోయిన్ గా నటిస్తుంది.  ఫాస్ట్ పేజ్ లో పక్కా ప్లానింగ్ తో షూటింగ్ ని కంప్లీట్ చేసుకునే ప్రాసెస్ లో ఉన్న సినిమా యూనిట్ ఆగష్టు 11 న సినిమాని రిలీజ్ చేసే ప్లాన్ లో ఉంది.