మహర్షి రీమేక్ పై బాలీవుడ్ హీరో క్లారిటీ

Monday,May 27,2019 - 06:24 by Z_CLU

తెలుగులో సూపర్ హిట్ అయింది మహర్షి సినిమా. ఈ సినిమాను హిందీలో సల్మాన్ ఖాన్ రీమేక్ చేయబోతున్నాడంటూ గాసిప్స్ వచ్చాయి. ఈ పుకార్లపై స్వయంగా సల్మాన్ రియాక్ట్ అయ్యాడు. అలాంటిదేం లేదని క్లియర్ గా చెప్పాడు.

భారత్ సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన సల్మాన్.. మహర్షి రీమేక్ ఆలోచన లేదని చెప్పేశాడు. ఇప్పటివరకు ఆ సినిమా చూడలేదని, తన వద్దకు ఎవరూ ఆ ప్రపోజల్ కూడా తీసుకురాలేదని అన్నాడు.

నిజానికి సల్మాన్ పై ఈ గాసిప్ రావడానికి ఓ రీజన్ ఉంది. గతంలో మహేష్ నటించిన పోకిరి సినిమాను వాంటెడ్ గా రీమేక్ చేసి సూపర్ హిట్ కొట్టాడు సల్మాన్. దీంతో మహేష్ నటించిన ఏ సినిమా హిట్ అయినా, దాన్ని సల్మాన్ రీమేక్ చేయబోతున్నాడంటూ పుకార్లు రావడం కామన్ అయిపోయింది.