సాహో నుంచి తప్పుకున్న సంగీత దర్శకులు

Monday,May 27,2019 - 06:40 by Z_CLU

సినిమా శరవేగంగా రెడీ అవుతోంది. రీసెంట్ గా రిలీడ్ డేట్ కూడా ఎనౌన్స్ చేశారు. ఇంతలోనే షాకింగ్ న్యూస్. అవును.. సాహో సినిమా నుంచి తప్పుకున్నట్టు ప్రకటించారు మ్యూజిక్ డైరక్టర్స్ శంకర్-ఎహసాన్-లాయ్.

సాహో నుంచి వరుసగా పోస్టర్లు వస్తున్నాయి. పోస్టర్లతో ఫ్యాన్స్ ఓవైపు పండగ చేసుకుంటుంటే మరోవైపు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్టు సంగీత త్రయం ప్రకటించింది. ఈ మేరకు ట్విట్టర్ లో వీళ్లు ప్రకటన చేశారు. వీళ్లు ఎందుకు సాహో నుంచి తప్పుకున్నారనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

సాహో నుంచి శంకర్-ఎహసాన్-లాయ్ తప్పుకోవడంతో ఆ స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారనేది ఇంట్రెస్టింగ్ టాపిక్ గా మారింది. సాహో మేకింగ్ వీడియోస్ కు ఇప్పటికే తమన్ సంగీతం అందిస్తున్నాడు. కుదిరితే అతడ్నే మ్యూజిక్ డైరక్టర్ గా కొనసాగిస్తారేమో.