వింటేజ్ క్రియేష‌న్స్‌ చేతికి 'బుర్రకథ' రైట్స్

Monday,May 27,2019 - 05:39 by Z_CLU

ఆది సాయికుమార్ హీరోగా.. రైట‌ర్ డైమండ్ ర‌త్న‌బాబు తొలిసారి ద‌ర్శ‌కుడిగా తెర‌కెక్కిస్తోన్న చిత్రం `బుర్ర‌క‌థ‌`. దీపాల ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై శ్రీకాంత్ దీపాల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా టీజ‌ర్‌కు ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ రెస్పాన్స్ కార‌ణంగానే సినిమా వ‌ర‌ల్డ్ వైడ్ థియేట్రిక‌ల్ రైట్స్‌ను వింటేజ్ క్రియేష‌న్స్ ఫ్యాన్సీ రేటుకు ద‌క్కించుకుంది.

రెండు మెద‌ళ్ల‌తో పుట్టిన హీరో ఎలాంటి ప‌రిస్థితుల‌ను ఎదుర్కొన్నాడ‌నే కాన్సెప్ట్‌తో రూపొందుతున్న చిత్ర‌మిది. నిర్మాత‌లు ఈ చిత్రాన్ని జూన్‌లో విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్నారు.

ప్ర‌స్తుతం సినిమా షూటింగ్ గోవాలో జ‌రుగుతుంది. అలాగే పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు కూడా శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. మిస్తీ చ‌క్ర‌వ‌ర్తి, నైరా షా హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఫన్ రైడ‌ర్‌గా అల‌రించ‌నుంది.

న‌టీన‌టులు:
ఆది సాయికుమార్‌, మిస్తీ చ‌క్ర‌వ‌ర్తి, నైరా షా, రాజేంద్ర ప్ర‌సాద్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, పృథ్వీరాజ్‌, గాయ‌త్రి గుప్తా,
అభిమ‌న్యు సింగ్‌, ఫిష్ వెంక‌ట్‌, ప్ర‌భాస్ శ్రీను, గీతా సింగ్ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: డైమండ్ ర‌త్న‌బాబు
నిర్మాత‌లు: హెచ్‌.కె.శ్రీకాంత్ దీపాల‌
బ్యాన‌ర్‌: దీపాల ఆర్ట్స్
మ్యూజిక్‌: సాయికార్తీక్‌
సినిమాటోగ్ర‌ఫీ: సి.రాంప్ర‌సాద్‌
ఎడిట‌ర్‌: ఎం.ఆర్‌.వ‌ర్మ‌
స్క్రీన్‌ప్లే: ఎస్‌.కిర‌ణ్‌, స‌య్య‌ద్‌, ప్ర‌సాద్ కామినేని, సురేష్ ఆర‌పాటి, దివ్యా భ‌వ‌న్ దిడ్ల‌
ఆర్ట్‌: చిన్నా
పాట‌లు: శివ‌శ‌క్తి ద్త‌, భాస్క‌ర భ‌ట్ల‌, కె.కె
ఫైట్స్‌: వెంక‌ట్, సాల్మ‌న్ రాజ్‌, రియ‌ల్ స‌తీష్‌