షాకింగ్.. వకీల్ సాబ్ లీక్

Monday,June 29,2020 - 01:33 by Z_CLU

వకీల్ సాబ్ వీడియో లీకైంది. ఈ సినిమాకు సంబంధించి కీలకమైన కోర్ట్ సీన్ వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనికి సంబంధించి స్టిల్స్ కొన్ని వాట్సాప్, ట్విట్టర్ లో సర్కులేట్ అవుతున్నాయి. దీంతో వకీల్ సాబ్ యూనిట్ షాక్ అయింది.

లాక్ డౌన్ కు ముందే సినిమా షూటింగ్ దాదాపు 80శాతం పూర్తయింది. అందులో కొంత ఫూటేజ్ ను గ్రాఫిక్స్ కోసం పంపించారు. సరిగ్గా అక్కడ్నుంచే వకీల్ సాబ్ కోర్టు సీన్ రిలీజైనట్టు పిక్స్ చూస్తే తెలుస్తోంది.

టాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద లీక్ గా అత్తారింటికి దారేది సినిమా నిలుస్తుంది. సరిగ్గా విడుదలకు కొన్ని రోజుల ముందు ఆ సినిమా మొత్తం లీక్ అయింది. మళ్లీ ఇప్పుడు పవన్ సినిమానే ఇలా లీక్ అవ్వడం బాధాకరం.

లీక్ అయిన వీడియోలో.. కోర్టులో లాయర్ గెటప్ లో పవన్ వాదిస్తుంటే.. వెనక అంజలి కూర్చొని ఉంది.