నిఖిల్ వెడ్డింగ్.... నో చేంజ్ !

Monday,March 16,2020 - 04:00 by Z_CLU

కరోనా ఎఫెక్ట్ తో మాల్స్ , సినిమా హాల్స్ మూసి వేసిన సంగతి తెలిసిందే. మరో వైపు షూటింగ్స్ కూడా ఆపేసుకున్నారు. ముహూర్తం ఫిక్స్ చేసుకుంటే కొందరిని మాత్రమే ఆహ్వానించి పెళ్ళిళ్ళు చేసుకోండి, ముహూర్తం పెట్టుకోకపోతే మాత్రం పోస్ట్ పోన్ చేసుకోమని తెలంగాణా ప్రభుత్వం చెప్పడంతో ఇప్పుడు టాలీవుడ్ యంగ్ హీరోల పెళ్ళిళ్ళు వాయిదా అంటూ వార్తలొస్తున్నాయి.

అవును వచ్చే నెల ఏప్రిల్ 16న హీరో నితిన్ అలాగే నిఖిల్ ఇద్దరూ పెళ్లి పీటలెక్కబోతున్నారు. అయితే కరోనా ఎఫెక్ట్ తో దుబాయ్ లో ప్లాన్ చేసిన నితిన్ పెళ్లి హైదరాబాద్ కి షిఫ్ట్ అయింది. అదే డేట్ కి నితిన్ పెళ్లి జరగనుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక నిఖిల్ మాత్రం తన పెళ్లి వాయిదా వేసుకునే ఆలోచనలో లేడట. అనుకున్న ముహూర్తానికి నిఖిల్ పెళ్లి జరగనుందట. హైదరాబాద్ లో ఏప్రిల్ 16న డా.పల్లవి వర్మను పెళ్ళాడబోతున్నాడు నిఖిల్. ఆ లోగ అన్నీ చక్కబడతాయని భావిస్తున్నాడు.