జీ స్పెషల్ : ఈ హీరోయిన్లు పక్కా వెజిటేరియన్లు !

Monday,March 16,2020 - 03:00 by Z_CLU

కెరీర్ కొన్నాళ్లు సాగాలంటే గ్లామర్ ను కాపాడుకోవడం చాలా అవసరం. కొన్ని సార్లు అందం కోసం, మరికొన్ని సార్లు చేస్తున్న క్యారెక్టర్ కోసం శాకాహారులుగా మారుతున్నారు హీరోయిన్లు. ఈ సీజన్ లో ఏకంగా ముగ్గురు భామలు ఇలా వెజ్ లోకి మారారు. ఎవరి కారణాలు వాళ్లకున్నాయి.

 హీరోయిన్ తమన్న కొత్తగా వెజిటేరియన్ గా మారింది. అందం కాపాడుకోవడం కోసం ఆమె శాకాహారిగా మారాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఆమె ఎప్పుడు స్లిమ్ అండ్ బ్యూటిఫుల్. కాకపోతే ఈసారి ‘సీటీమార్’ అనే సినిమాలో పాత్ర కోసం వెజిటేరియన్ గా మారింది. సినిమాలో కబడ్డీ కోచ్ జ్వాలారెడ్డి పాత్ర పోషిస్తోంది మిల్కీబ్యూటీ. ఈ పాత్ర కోసమే కొన్నాళ్ల పాటు వెజిటేరియన్ గా మారింది.

 రీసెంట్ గా రష్మిక కూడా వెజిటేరియన్ గా మారింది. ప్రస్తుతం ఈమె టాలీవుడ్ లో లీడింగ్ పొజిషన్ లో ఉంది. క్రేజీ అవకాశాలు దక్కించుకుంటోంది. ఇలాంటి టైమ్ లో ఆరోగ్యంగా ఉండడంతో పాటు అందంగా ఉండడం కూడా ఎంతో అవసరం. అందుకే తనకు ఇష్టం లేకపోయినా శాకాహారం తీసుకుంటోంది ఈ కన్నడ కస్తూరి.

 ఇక తాజాగా వెజిటేరియన్ లోకి మారిన మరో బ్యూటీ సమంత. చేపల్లేకుండా ఉండలేదు సమంత. మరీ ముఖ్యంగా సాల్మెన్ రకం చేపలంటే ఈమెకు చాలా ఇష్టం. కానీ ఇప్పుడు అవన్నీ పక్కనపెట్టేసింది. పూర్తిగా శాకాహారం మాత్రమే తీసుకుంటోంది.