జీ సినిమాలు (17th మార్చ్ )

Monday,March 16,2020 - 10:02 by Z_CLU

కణం

నటీనటులు : నాగశౌర్యసాయి పల్లవి
ఇతర నటీనటులు బేబీ వెరోనికాప్రియదర్శి తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : C. స్యామ్
డైరెక్టర్ : A.L. విజయ్
ప్రొడ్యూసర్స్ లైకా ప్రొడక్షన్స్


కృష్ణ (నాగ శౌర్య)తులసి (సాయి పల్లవి) టీనేజ్ లో ప్రేమించుకొని పెద్దలు ఐదేళ్ళు గడిచాక పెళ్లి చేస్తాం అని చెప్పడంతో విడిపోయి సెటిల్ అయ్యాక పెళ్ళిచేసుకొని దంపతులుగా మారతారు. అయితే టీనేజ్ లో ఇద్దరూ కలిసి చేసిన ఓ తప్పు ను కప్పిపుచ్చడానికి వీరి కుటుంబాలు తీసుకున్న ఓ నిర్ణయం వల్ల అందరూ వరుసగా మృత్యువాత పడతారు. ఇంతకీ కృష్ణ – తులసి చేసిన తప్పేంటి… ఆ ఐదేళ్ళ తర్వాత వీరి జీవితం ఎలా సాగింది. పెళ్లి తర్వాత వీరి జీవితంలో ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి.. అనేది మిగతా కథ.

____________________________________

బాబు బంగారం

నటీనటులు : వెంకటేష్నయనతార

ఇతర నటీనటులు : సంపత్ రాజ్మురళీ శర్మజయప్రకాష్బ్రహ్మానందంపోసాని కృష్ణ మురళి మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : జిబ్రాన్

డైరెక్టర్ : మారుతి

ప్రొడ్యూసర్ : S . నాగవంశీ, P . D . V .  ప్రసాద్

రిలీజ్ డేట్ : 12 ఆగష్టు 2016

తాత జాలిగుణం వారసత్వం గా అందుకున్న కృష్ణ (వెంకటేష్) అనే పోలీస్ ఆఫీసర్  జాలి గుణం తోనే జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. ఒకానొక సందర్భం లో తన లాగే జాలి గుణం తో ఉండే శైలు (నయనతార) ను చూసి ఇష్టపడతాడు కృష్ణ. ఇక తాను ప్రేమిస్తున్న శైలు కుటుంబానికి ఎం.ఎల్.ఏ పుచ్చప్ప (పోసాని),  మల్లేష్(సంపత్) లతో ఆపద ఉందని తెలుసుకున్న కృష్ణ  ఫామిలీ ను అలాగే శైలు నాన్న ను ఎలా కాపాడాడుచివరికి కృష్ణ  ఇద్దరి ఆట ఎలా కట్టించాడుఅనేది చిత్ర కథాంశం.

____________________________________________

ఒంగోలు గిత్త

నటీనటులు రామ్ పోతినేనికృతి కర్బందా

ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్కిషోర్ దాస్ప్రభుఅజయ్అభిమన్యు సింగ్ఆహుతి ప్రసాద్రమాప్రభరఘుబాబుసంజయ్ రెడ్డి తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : G.V. ప్రకాష్ కుమార్

డైరెక్టర్ : భాస్కర్

ప్రొడ్యూసర్ : B.V.S.N. ప్రసాద్

రిలీజ్ డేట్ : 1 ఫిబ్రవరి 2013

రామ్ కరియర్ లోనే అల్టిమేట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఒంగోలుగిత్త. పసితనంలో తన తండ్రికి జరిగిన అన్యాయానికి కుట్ర వెనక దాగిన పెద్ద మనిషి అసలు రంగును బయటపెట్టడానికి వచ్చిన యువకుడిలా రామ్ అద్భుతంగా నటించాడు. ఈ సినిమాలో కృతి కర్బందా హీరోయిన్ గా నటించింది.

______________________________________

చిరుత

నటీనటులు : రామ్ చరణ్ తేజనేహా శర్మ

ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్ఆశిష్ విద్యార్థిబ్రహ్మానందంఆలీసాయాజీ షిండే, M.S. నారాయణ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ

డైరెక్టర్ పూరి జగన్నాథ్

ప్రొడ్యూసర్ : C. అశ్విని దత్

రిలీజ్ డేట్ : 28 సెప్టెంబర్ 2007

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డెబ్యూ మూవీ చిరుత. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన  యాక్షన్ ఇమోషనల్ ఎంటర్ టైనర్ రామ్ చరణ్ లోని పర్ఫామెన్స్ ని స్టామినాని పర్ఫెక్ట్ గా ఎలివేట్ చేసింది. దానికి తోడు మణిశర్మ సంగీతం సినిమా సక్సెస్ లో కీ రోల్ ప్లే చేసింది.

_________________________________________

ABCD

నటీనటులు : అల్లు శిరీష్, రుక్సార్ థిల్లాన్

ఇతర నటీనటులు : భరత్, నాగబాబు, రాజా, కోట శ్రీనివాస రావు, శుభలేఖ సుధాకర్ మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : జుధా సాందీ

డైరెక్టర్ : సంజీవ్ రెడ్డి

ప్రొడ్యూసర్స్ : మధుర శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని

రిలీజ్ డేట్ : 17th మే 2019

న్యూయార్క్‌లో సెటిలైన ఇండియన్‌ మిలియనీర్‌ విద్యా ప్రసాద్‌ (నాగబాబు) కొడుకు అరవింద్ ప్రసాద్‌ (అల్లు శిరీష్‌) అలియాస్‌ అవి.. తన అత్త కొడుకు బాషా అలియాస్‌ బాలషణ్ముగం (భరత్‌)తో కలిసి జీవితాన్ని సరదాగా గడిపేస్తుంటాడు. ఎలాంటి లక్ష్యం లేకుండా నెలకు 20 వేల డాలర్లు ఖర్చు చేస్తూ లైఫ్ ని లైట్ గా తీసుకొంటాడు అవి. ఎంతో కష్టపడి మిలియనీర్ గా ఎదిగిన విద్యా ప్రసాద్ (నాగబాబు) తన కొడుక్కి డబ్బు విలువ తెలియజేయాలనుకుంటాడు. ఈ క్రమంలో అవి, బాషాను ఇండియాకి పంపిస్తాడు.

అలా ఇండియాకు పంపించిన వారిద్దరూ నెలకు 5000 వేలు మాత్రమే ఖర్చు చేస్తూ ఎంబీఏ పూర్తి చేయాలని కండీషన్ పెడతాడు. లగ్జరీ లైఫ్ కి అలవాటు పడిన అవి, భాషాలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుంటారు. అలా తప్పనిసరి పరిస్థితుల్లో హైదరాబాద్‌లో సెటిల్ అయిన అవికి లోకల్ పొలిటీషన్‌ భార్గవ్‌(రాజా)తో గొడవ అవుతుంది. ఇంతకీ అవి, భార్గవ్‌ల మధ్య గొడవేంటి..? అమెరికాలో పుట్టి పెరిగిన అవి, బాషాలు చివరికి ఇండియాలో ఎలా సర్ధుకుపోయారు..? స్లమ్ జీవితాన్ని గడిపిన అవి చివరికి ఏం తెలుసుకున్నాడు..? అనేది సినిమా కథాంశం.