నితిన్ కొత్త సినిమా..ఆగస్ట్ నుండి సెట్స్ పైకి  

Monday,June 04,2018 - 05:04 by Z_CLU

ప్రస్తుతం సతీష్ వేగేశ్న డైరెక్షన్ లో ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమా చేస్తున్నాడు నితిన్… ఈ సినిమా ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజికి చేరుకుంది. ఈ సినిమా తర్వాత ‘ఛలో’ తో సూపర్ హిట్ అందుకున్న  వెంకీ కుడుముల డైరెక్షన్ లో ఓ మూవీ చేయనున్నాడు నితిన్. అయితే ఈ సినిమా ఆగిపోయిందనే టాక్ ప్రెజెంట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

అయితే ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకూ  ఈ వార్త నిజం కాదని తెలుస్తుంది…  ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ స్టేజిలో ఉన్న ఈ సినిమా ఆగస్ట్ నుండి సినిమా సెట్స్ పైకి వెళ్ళబోతుందని సమాచారం. సీతార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మించనున్నారు.