నితిన్ సరసన శృతిహాసన్..?

Sunday,November 06,2016 - 01:00 by Z_CLU

అ..ఆ సినిమా తర్వాత నితిన్ రేంజ్ పెరిగింది. అతడి సినిమాలపై ఇంకాస్త ఎక్కువ ఖర్చుపెట్టేందుకు నిర్మాతలు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. మరీ ముఖ్యంగా ఓవర్సీస్ లో నితిన్ కు మార్కెట్ పెరగడంతో సినిమా బడ్జెట్ కూడా పెరిగింది. ఇందులో భాగంగా స్టార్ హీరోయిన్ ను తీసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అ..ఆ సినిమాలో సమంత లాంటి స్టార్ హీరోయిన్ తో నటించిన నితిన్.. తన నెక్ట్స్ సినిమా కోసం కూడా మరోసారి పవన్ హీరోయిన్ నే సెలక్ట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం… నితిన్ నెక్ట్స్ మూవీలో శృతిహాసన్ హీరోయిన్ గా నటించే అవకాశం ఉంది.

collage3

14 రీల్స్ ఎఁటర్ టైన్ మెంట్ బ్యానర్ పై హను రాఘవపూడి దర్శకత్వంలో ఇప్పటికే ఓ సినిమా స్టార్ట్ చేశాడు నితిన్. త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్న ఈ సినిమాలో శృతిహాసన్ ను హీరోయిన్ గా తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ.. పవన్ సరసన కాటమరాయుడు సినిమా చేస్తోంది. దీంతో పాటు మరో రెండు ప్రాజెక్టులతో కూడా బిజీగా ఉంది.