పవన్-త్రివిక్రమ్ మూవీ అప్ డేట్స్

Sunday,November 06,2016 - 11:30 by Z_CLU

ప్రస్తుతం వరుస సినిమాలను ప్రారంభిస్తూ స్పీడ్ పెంచిన పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ తో సినిమాను వచ్చే నెలలో సెట్స్ పై పెట్టబోతున్నాడు. ఇటీవలే ప్రారంభమైన ఈ చిత్రంతో మరో బ్లాక్ బస్టర్ అందుకోవాలని చూస్తున్నారు పవన్-త్రివిక్రమ్. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘జల్సా’ సూపర్ హిట్ గా నిలవగా రెండో చిత్రంగా వచ్చిన ‘అత్తారింటికి దారేది’ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అందుకే మరోసారి అదే ఫార్ములాతో ఓ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కథ తో ఈ సినిమాను రూపొందించబోతున్నాడట త్రివిక్రమ్.

sai_7554

డిసెంబర్ నుండి ప్రారంభం కానున్న ఈ చిత్రంలో అత్తారింటికి దారేది మేజిక్ నే మరోసారి రిపీట్ చేయబోతున్నాడట మాటల మాంత్రికుడు. ఈ చిత్రం లో కూడా పవన్ సరసన ఇద్దరు కథానాయికలను తీసుకోవాలని డిసైడ్ అయ్యాడట. మరోవైపు సినిమాటోగ్రాఫర్ గా బాలీవుడ్ కెమెరామేన్ మణికందన్ ను, సంగీత దర్శకుడిగా కోలీవుడ్ సెన్సేషన్ అనిరుధ్ ను పవన్ సినిమా కోసం తీసుకున్నారు.