ఫ్యామిలీ ఫొటో పెట్టిన సమంత

Sunday,November 06,2016 - 02:12 by Z_CLU

సమంత తన ఫ్యామిలీ ఫొటో పెట్టింది. ఇదేదో రొటీన్ గా తన తల్లిదండ్రులతో కలిసి సమంత పెట్టిన పిక్ అయితే అంతా లైట్ తీసుకునేవాళ్లు. కానీ సమంత పెట్టింది అలాంటిలాంటి ఫొటో కాదు. త్వరలోనే ఫ్యామిలీగా మారబోతున్న ఫొటో. అవును…  తన కాబోయే భర్త నాగచైతన్య, మరిది అఖిల్ తో పాటు… అఖిల్ కాబోయే భార్య శ్రియ భూపాల్ తో కలిసి ఓ ఫొటో దిగింది సమంత. ఇదే నా ఫ్యామిలీ అంటూ ఓ ఫొటోను షేర్ చేసింది. మీరూ ఓ లుక్కేయండి..

samantha-family
వచ్చేనెల 9న అఖిల్-శ్రియ భూపాల్ నిశ్చిరాత్థం జరుగుతోంది. వచ్చే ఏడాదిలో ఈ జంట పెళ్లిచేసుకోబోతోంది. అఖిల్-శ్రియల పెళ్లి అయిన కొన్ని రోజులకే సమంత-చైతూల వివాహం కూడా జరగనుంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే ఏడాది ఏప్రిల్ లో చైతూ-సమంతల పెళ్లి ఉండొచ్చు.