హ్యాపీ బర్త్ డే టు నితిన్

Monday,March 30,2020 - 01:36 by Z_CLU

ఈరోజు తన పుట్టినరోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నాడు యూత్ స్టార్ నితిన్. ఓవైపు పుట్టినరోజు సంబరాలు, మరోవైపు బ్లాక్ బస్టర్ భీష్మ. ఇలా 2 పండగలు ఒకేసారి వచ్చేశాయి. దీంతో నితిన్ కాంపౌండ్ లో ఫుల్ హంగామా నడుస్తోంది.

మరీ ముఖ్యంగా ఈ బర్త్ డే నితిన్ కు వెరీ వెరీ స్పెషల్. ఎందుకంటే జీవితంలో పెళ్లి అనే ఫేజ్ లోకి ఎంటర్ అవ్వబోతున్నాడు నితిన్. ఈమధ్యే తన ప్రేయసితో నిశ్చితార్థం కూడా పూర్తయింది. త్వరలోనే పెళ్లి. అందుకే ఈ పుట్టినరోజు నితిన్ జీవితంలోనే వెరీ వెరీ స్పెషల్.

దీనికి తోడు ప్రొఫెషనల్ గా కూడా పీక్ స్టేజ్ లో ఉన్నాడు ఈ హీరో. భీష్మ సినిమా ఇతడి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ (తెలుగు రాష్ట్రాల్లో)గా నిలిచింది. మరోవైపు చేతిలో 3 సినిమాలున్నాయి.

ఈ బర్త్ డేకు ఓవైపు భీష్మ బ్లాక్ బస్టర్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూనే మరోవైపు రంగ్ దే ఫస్ట్ లుక్ వదిలాడు నితిన్. పోస్టర్స్ తో ఈ మూవీ కూడా ప్రామిసింగ్ అనిపించుకుంటోంది. మరీ ముఖ్యంగా దేవిశ్రీప్రసాద్, పీసీ శ్రీరామ్ లాంటి దిగ్గజ టెక్నీషియన్స్ సపోర్ట్ ఈ సినిమాకు ఉండడంతో నితిన్ గట్టి నమ్మకంతో ఉన్నాడు.

అ..ఆ మూవీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

జయం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్స్ అందుకున్నాడు. లవర్ బాయ్ ఇమేజ్ కొనసాగిస్తూనే, మాస్ సినిమాలతో కూడా మెప్పించాడు. ఆమధ్య అ..ఆతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న నితిన్.. ఇప్పుడు భీష్మతో మరో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ పుట్టినరోజు సందర్భంగా నితిన్ కు ప్రత్యేకంగా బర్త్ డే విశెష్ అందజేస్తోంది జీ సినిమాలు.