జీ సినిమాలు (మార్చి 30)

Sunday,March 29,2020 - 09:01 by Z_CLU

అభినేత్రి
నటీనటులు : ప్రభు దేవా, తమన్నా, సోను సూద్, అమీ జాక్సన్
ఇతర నటీనటులు : సప్తగిరి, మురళి శర్మ, పృథ్వి
మ్యూజిక్ డైరెక్టర్ : సాజిద్ వాజిద్
డైరెక్టర్ : ఎ.ఎల్.విజయ్
ప్రొడ్యూసర్ : గణేష్, ప్రభుదేవా
రిలీజ్ డేట్ : అక్టోబర్ 7, 2016

A.L. విజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని మరికొందరు నిర్మాతలతో కలిసి ప్రభుదేవా స్వయంగా నిర్మించాడు. కథలో కాస్తయినా ఎక్సయింట్ మెంట్ లేకపోతే.. సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వదు తమన్న. హారర్ కాన్సెప్ట్ తో తెరకెక్కినప్పటికీ… ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమా ఇది. మిల్కీ బ్యూటీని డ్యూయల్ రోల్ లో విభిన్నంగా ప్రెజెంట్ చేసిన సినిమా ‘అభినేత్రి’.

==================================

చినబాబు
నటీనటులు : కార్తీ, సాయేషా
ఇతర నటీనటులు : సత్యరాజ్, ప్రియా భవానీ శంకర్, అర్ధన బిను, సూరి, భానుప్రియ, విజి చంద్రశేఖర్,
సరోజా, మౌనిక తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : D. ఇమ్మన్
డైరెక్టర్ : పాండిరాజ్
ప్రొడ్యూసర్ : సూర్య
రిలీజ్ డేట్ : 13 జూలై 2018

రుద్రరాజు (సత్య రాజ్)ది పెద్ద కుటుంబం. ఇద్దరు భార్యలు, ఆరుగురు సంతానం. ఐదుగురు అమ్మాయిల తర్వాత మగ పిల్లాడి కోసం ఎదురుచూస్తున్న వేళ ఆఖరివాడుగా కృష్ణంరాజు(కార్తి) పుడతాడు. అందుకే చినబాబు అవుతాడు. పొలం బాధ్యతలతో పాటు కుటుంబాన్ని కూడా చూసుకుంటాడు చినబాబు. వ్యవసాయం అనేది వృతి కాదు… జీవన విధానం అని నమ్మే చినబాబు పల్లెటూళ్ల నుండి సిటీకెళ్ళిన
వాళ్లంతా ఎప్పటికైనా సొంత ఊరిలో రైతులుగా స్థిరపడాలనే లక్ష్యంతో రైతుగా జీవితాన్ని కొనసాగిస్తుంటాడు. ఈ క్రమంలో జాలీ సోడా యజమాని నీల నీరధ(సాయేషా)ను తొలిచూపులోనే ప్రేమిస్తాడు. కానీ చినబాబు అక్కయ్యలకు వయసుకు వచ్చిన ఇద్దరు కూతుర్లుంటారు. మేనమామగా మరదళ్లను చిన్నతనం నుండి అల్లారుముద్దుగా చూసుకుంటాడు. అయితే తనకు నచ్చిన అమ్మాయిని కాకుండా తమ
కూతురునే పెళ్లి చేసుకోవాలని చినబాబుతో గొడవకు దిగుతారు ఇద్దరు అక్కలు. మరోవైపు కులరాజకీయాలు నడుపుతూ ఊరిలో పెద్దమనిషిగా ఉండే సురేందర్ రాజు(శత్రు)ని ఒక స్టూడెంట్ హత్య కేసులో జైలుకు పంపిస్తాడు చినబాబు. పగబట్టిన సురేందర్ రాజు చినబాబుని చంపే ప్రయత్నాల్లో ఉంటాడు. చినబాబు పెళ్ళి మేటర్ తో కుటుంబంలో కలతలొస్తాయి. మరి చినబాబు తన అక్కయ్యలను ఒప్పించి తను ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడా… చివరికి సురేందర్ రాజు
నుంచి ఎలా తప్పించుకున్నాడు… కుటుంబం మొత్తాన్ని ఎలా కలిపాడనేది మిగతా కథ…

========================

శతమానంభవతి
నటీనటులు : శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్
ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, జయసుధ, నరేష్, ఇంద్రజ, రాజా రవీంద్ర, హిమజ, ప్రవీణ్ మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : మిక్కీ. జే. మేయర్
డైరెక్టర్ : సతీష్ వేగేశ్న
ప్రొడ్యూసర్ : దిల్ రాజు
రిలీజ్ డేట్ : 14 జనవరి 2017

ఆత్రేయపురం అనే గ్రామంలో రాఘవ రాజు(ప్రకాష్ రాజ్) జానకమ్మ(జయసుధ) అనే దంపతులు తమ పిల్లలు విదేశాల్లో స్థిరపడి తమను చూడడానికి రాకపోవడంతో కలత చెంది తన మనవడు రాజు (శర్వానంద్) తో కలిసి సొంత ఊరిలోనే జీవిస్తుంటారు. ఈ క్రమంలో పిల్లల్ని ఎలాగైనా సంక్రాంతికి తమ ఊరికి రప్పించాలని రాజు గారిని కోరుతుంది జానకమ్మ. తన భార్య కోరిక మేరకూ ఎప్పుడు కబురుపెట్టినా రాని పిల్లల కోసం ఒక పథకం వేసి సంక్రాంతికి ఊరు రప్పిస్తాడు రాఘవ రాజు. ఇంతకీ రాజు గారు వేసిన ఆ పథకం ఏమిటి? రాజు గారి కబురు మేరకు స్వదేశం తిరిగొచ్చిన పిల్లలు తాము దూరంగా ఉండడం వల్ల తల్లిదండ్రుల పడుతున్న భాధ ఎలా తెలుసుకున్నారు? అనేది ఈ సినిమా కథాంశం.

============================

రాఖి
నటీనటులు : NTR, ఇలియానా, చార్మి
ఇతర నటీనటులు : సుహాసిని, రవి వర్మ, ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాస రావు, చంద్ర మోహన్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్
డైరెక్టర్ : కృష్ణవంశీ
ప్రొడ్యూసర్ : K.L. నారాయణ
రిలీజ్ డేట్ : 22 డిసెంబర్ 2006

NTR, కృష్ణవంశీ కాంబినేషన్ లో తెరకెక్కిన రాఖీ ఇద్దరి కరియర్ లోను డిఫరెంట్ సినిమా. ఆడపిల్లలపై జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా ఒక యువకుడు చట్టాన్ని తన చేతిలోకి తీసుకుని పోరాటం చేయడమే రాఖీ సినిమా ప్రధానాంశం. ఈ సినిమాలో ఛార్మి నటన హైలెట్.

==============================

ABCD
నటీనటులు : అల్లు శిరీష్, రుక్సార్ థిల్లాన్
ఇతర నటీనటులు : భరత్, నాగబాబు, రాజా, కోట శ్రీనివాస రావు, శుభలేఖ సుధాకర్ మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : జుధా సాందీ
డైరెక్టర్ : సంజీవ్ రెడ్డి
ప్రొడ్యూసర్స్ : మధుర శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని
రిలీజ్ డేట్ : 17th మే 2019

న్యూయార్క్‌లో సెటిలైన ఇండియన్‌ మిలియనీర్‌ విద్యా ప్రసాద్‌ (నాగబాబు) కొడుకు అరవింద్ ప్రసాద్‌ (అల్లు శిరీష్‌) అలియాస్‌ అవి.. తన అత్త కొడుకు బాషా అలియాస్‌ బాలషణ్ముగం (భరత్‌)తో కలిసి జీవితాన్ని సరదాగా గడిపేస్తుంటాడు. ఎలాంటి లక్ష్యం లేకుండా నెలకు 20 వేల డాలర్లు ఖర్చు చేస్తూ లైఫ్ ని లైట్ గా తీసుకొంటాడు అవి. ఎంతో కష్టపడి మిలియనీర్ గా ఎదిగిన విద్యా ప్రసాద్ (నాగబాబు) తన కొడుక్కి డబ్బు విలువ తెలియజేయాలనుకుంటాడు. ఈ క్రమంలో అవి, బాషాను ఇండియాకి పంపిస్తాడు.

అలా ఇండియాకు పంపించిన వారిద్దరూ నెలకు 5000 వేలు మాత్రమే ఖర్చు చేస్తూ ఎంబీఏ పూర్తి చేయాలని కండీషన్ పెడతాడు. లగ్జరీ లైఫ్ కి అలవాటు పడిన అవి, భాషాలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుంటారు. అలా తప్పనిసరి పరిస్థితుల్లో హైదరాబాద్‌లో సెటిల్ అయిన అవికి లోకల్ పొలిటీషన్‌ భార్గవ్‌(రాజా)తో గొడవ అవుతుంది. ఇంతకీ అవి, భార్గవ్‌ల మధ్య గొడవేంటి..? అమెరికాలో పుట్టి పెరిగిన అవి, బాషాలు చివరికి ఇండియాలో ఎలా సర్ధుకుపోయారు..? స్లమ్ జీవితాన్ని గడిపిన అవి చివరికి ఏం తెలుసుకున్నాడు..? అనేది సినిమా కథాంశం.

================================

స్టూడెంట్ నంబర్ 1
నటీనటులు : N.T.R., గజాల
ఇతర నటీనటులు : రాజీవ్ కనకాల, బ్రహ్మానందం, ఆలీ, సుధ, కోట శ్రీనివాస రావు, M.S. నారాయణ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : M.M. కీరవాణి
డైరెక్టర్ : S.S. రాజమౌళి
ప్రొడ్యూసర్ : K. రాఘవేంద్ర రావు
రిలీజ్ డేట్ : 27 సెప్టెంబర్ 2001

ఇంజనీర్ అవ్వాలనే ప్యాషన్ ఉన్నా కేవలం చేయని నేరానికి శిక్షననుభవిస్తున్న తండ్రిని కాపాడుకోవడానికి లా కాలేజ్ లో జాయిన్ అవుతాడు ఆదిత్య. ఓ వైపు మర్డర్ కేసులో జైలు పాలయినా, జైలులో ఉంటూ కూడా తన తండ్రి గౌరవం కాపాడటానికి కష్టపడతాడు. అసలు ఆదిత్య చంపింది ఎవరిని…? ఎందుకు చేశాడా హత్య..? తన తండ్రిని నిర్దోషిగా నిరూపించడంలో ఆదిత్య ప్రయత్నం సక్సెస్ అవుతుందా…? ఆదిత్య జైలు నుండి విడుదల అవుతాడా…? అనేదే ఈ సినిమా ప్రధానాంశం.