కరోనా సాంగ్ పాడిన మెగాస్టార్

Monday,March 30,2020 - 02:15 by Z_CLU

కరోనా నివారణకు ఫండ్ ఇవ్వడమే కాకుండా.. ఆ వైరస్ పై అవగాహన కల్పించే దిశగా కూడా టాలీవుడ్ ముందుంది. దీనికోసం ఏకంగా ఓ స్పెషల్ సాంగ్ రెడీ అయింది. మ్యూజిక్ డైరక్టర్ కోటి ఓ పాటకు ట్యూన్‌ కట్టగా… మెగాస్టార్‌ చిరంజీవి, నాగార్జునతో పాటు యంగ్‌ హీరోలు వరుణ్‌ తేజ్‌, సాయి తేజ్‌ ఈ పాట పాడారు.

ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుపుతూ… వైరస్‌ నిర్మూలనకు చేయాల్సిన కృషిని పాట రూపంలో ప్రేక్షకులకు అందించారు. అంతేకాకుండా ఆ పాటను పాడి, రికార్డ్‌ చేసి ఆ వీడియోను పంపమని చిరంజీవి నెటిజన్లను ట్విట్టర్‌లో కోరారు.

21 రోజుల పాటు లాక్‌డౌన్‌ నేపథ్యంలో సినిమా షూటింగ్‌లు కూడా ఆగిపోవడంతో పలువురు కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారిని ఆదుకునేందుకు సీసీసీ మనకోసం (కరోనా క్రైసిస్‌ ఛారిటీ మనకోసం) అనే సంస్థ ఏర్పాటు చేశారు. ఈ సంస్థకి చైర్మన్‌గా చిరంజీవి ఉన్నారు. ఇప్పటికే పలువురు నటులు సీసీసీకి విరాళాలు ప్రకటిస్తున్నారు. దీని ద్వారా సినీకార్మికుల్ని ఆదుకుంటున్నారు.