హిట్ ఇచ్చిన దర్శకుడితో రెండో ప్రయత్నం

Monday,March 18,2019 - 06:47 by Z_CLU

సక్సెస్ ఇచ్చిన దర్శకుడికి వెంటనే మరో ఛాన్స్ ఇవ్వడానికి హీరోలు ఎప్పుడూ వెనకాడరు. మహేష్, బన్నీ, ప్రభాస్, రామ్ చరణ్.. ఇలా ఎంతోమంది హీరోలు తమకు హిట్ ఇచ్చిన దర్శకుల్ని రిపీట్ చేసినోళ్లే. ఇప్పుడీ లిస్ట్ లోకి నితిన్ కూడా చేరాడు. గతంలో తనకు హిట్టిచ్చిన విజయ్ కుమార్ కొండాకు మరో ఛాన్స్ ఇవ్వబోతున్నాడు

 విజయ్ కుమార్ కొండా తీసిన గుండెజారి గల్లంతయ్యిందే సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో నితిన్-నిత్యామీనన్ నటించారు. అయితే ఆ సక్సెస్ తర్వాత మళ్లీ నితిన్-విజయ్ కలిసి సినిమా చేయలేదు. ఇన్నాళ్లకు ఆ ఛాన్స్ వచ్చింది.

నితిన్ కోసం మరో ప్రేమకథ రెడీ చేశాడట విజయ్ కుమార్ కొండా.  స్టోరీలైన్ విన్న నితిన్ కూడా ఓకే చెప్పాడట. ప్రస్తుతం భీష్మ సినిమా వర్క్ తో బిజీగా ఉన్న నితిన్, ఆ సినిమా ఓ కొలిక్కి వచ్చిన వెంటనే విజయ్ కుమార్ కొండా సినిమాను ఎనౌన్స్ చేయబోతున్నాడు.