తొలిసారి డ్యూయల్ రోల్ లో నయనతార

Monday,March 18,2019 - 03:47 by Z_CLU

న‌య‌న‌తార తొలిసారిగా ద్విపాత్రాభిన‌యం చేసిన `ఐరా` ఈ నెల 28న విడుద‌ల కానుంది. గంగా ఎంట‌ర్‌టైన్మెంట్స్, కేజేఆర్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన సినిమా ఇది. స‌ర్జున్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. తెలుగు, త‌మిళంలో ఒకేసారి విడుద‌ల చేయ‌నున్నారు.

సినిమాలో భవాని, యమున అనే రెండు పాత్రల్లో కనిపించబోతోంది నయనతార. ఇందులో భవాని పాత్ర డీ-గ్లామరస్ గా ఉండబోతోంది. ఈ క్యారెక్టర్ కోసం నయనతార మేకప్ లేకుండా నటించిందట. హారర్-థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కింది ఐరా సినిమా.

నిజానికి ఈ సినిమాలో రెండో పాత్ర కోసం మరో హీరోయిన్ ను తీసుకోవాలని అనుకున్నారు. కానీ పాత్ర ఛాయలు, కథ ప్రకారం, భవాని పాత్రను కూడా నయనతారే చేస్తే బాగుంటుందని యూనిట్ ఫీల్ అయింది. నయన్ కూడా వెంటనే ఒప్పుకుంది. అలా తొలిసారిగా ద్విపాత్రాభినయం చేసింది నయన్.

న‌టీన‌టులు: కళైయ‌ర‌సి, యోగిబాబు, మ‌నోబాలా, ఎం.ఎస్‌.భాస్క‌ర్‌, వంశీకృష్ణ‌, ప్ర‌వీణ్ రంగ‌నాథ‌న్‌, జ‌య‌ప్ర‌కాష్‌, లీలావ‌తి, కృష్ణ అభిషేక్‌, ర‌వి ప్ర‌కాష్ త‌దిత‌రులు
కెమెరా: సుద‌ర్శ‌న్ శ్రీనివాస‌న్‌,
కూర్పు: కార్తిక్ జోగేష్‌,
స్క్రీన్‌ప్లే: ప్రియాంక ర‌వీంద్ర‌న్‌
సంగీతం: సుంద‌రమూర్తి. కె.ఎస్‌.
దర్శకత్వం: సర్జున్