హైదరాబాద్ లో Rajinikanth !

Monday,December 14,2020 - 12:50 by Z_CLU

లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిన సూపర్ స్టార్ Rajinikanth సినిమా షూట్ మళ్ళీ మొదలైంది. శివ దర్శకత్వంలో యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న Annaatthe షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది. చెన్నై నుండి స్పెషల్ ఫ్లైట్ లో హైదరాబాద్ విచ్చేసిన రజిని తాజాగా షూటింగ్ లో పాల్గొంటున్నారు.

Rajinikanth-joins-annaatthe-shoot-in-hyderabad

 RFC లో వేసిన ప్రత్యేకమైన సెట్ లో రజినీ కాంత్ , నయనతార లపై కొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేస్తున్నారు. దాదాపు పది రోజుల పాటు ఈ షెడ్యుల్ జరగనుందని సమాచారం.  సినిమాలో దర్శకుడు శివ స్టైల్ ఆఫ్ యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయని తెలుస్తుంది.  నాయన తార, కీర్తి సురేష్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో మీనా , ఖుష్బు ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు.

సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకు డి.ఇమాన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. వచ్చే ఏడాది సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Check రజిని సినిమాలో గోపీచంద్ లేడట!